Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand vs South Africa: నికోల‌స్ సెంచ‌రీ.. 11లో వ‌చ్చి హెన్రీ హాఫ్ సెంచ‌రీ.. భారీ అధిక్యంలో కివీస్‌

New Zealand vs South Africa: Henry Nicholas Century .. New Zealand score 482 in first innings. South Africa 34-3 in second innings.

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో అతిథ్య న్యూజిలాండ్ ప‌ట్టు బిగించింది. హెన్రీ నికోల‌స్ సెంచ‌రీకి తోడు, వికెట్ కీప‌ర్ టామ్ బ్లండెల్ భారీ ఇన్నింగ్స్‌, చివ‌ర‌లో 11వ వికెట్‌గా వ‌చ్చిన మాట్ హెన్రీ అజేయ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 482 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప‌ర్యాట‌క జ‌ట్టు సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 387 పరుగుల భారీ అధిక్య‌త సాధించింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో హెన్రీ నికోల‌స్‌ 105, టామ్ బ్లండెల్ 96 ప‌రుగుల‌తో చెల‌రేగారు. 11వ స్థానంలో వ‌చ్చిన‌ మాట్ హెన్రీ (58*) అజేయ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దీంతో చివ‌రి వికెట్‌కు 94 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా మాట్ హెన్నీ బౌల‌ర్‌గానూ 7 వికెట్ల‌తో చెల‌రేగాడు. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో వాగ్న‌ర్ 49, గ్రాండ్ హోం 45, కాన్వే 36, లాథ‌మ్ 15, జేమీష‌న్ 15, మిచెల్ 16, విల్ యంగ్ 8, సౌథీ 4 ప‌రుగుల చేశారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ఒలివ‌ర్ 3 వికెట్లు తీయ‌గా, ర‌బాడ‌, మాక్ర‌మ్, మార్కో జేన్స‌న్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. గ్లెంటన్ స్టౌర్మాన్ ఒక వికెట్ తీశాడు.

అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాను కివీస్ బౌల‌ర్లు సౌథీ, హెన్రీ ఆరంభంలోనే దెబ్బ కొట్టారు. దీంతో ఆ జ‌ట్టు 4 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లు డీన్ ఎల్గ‌ర్, సరేల్ ఎర్వీ డ‌కౌట్ అయ్యారు. మాక్ర‌మ్ రెండు ప‌రుగులు చేశాడు. ఈ స‌మ‌యంలో డ‌సెన్, బ‌వుమా మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డి రెండో రోజు ఆట‌ను ముగించారు. క్రీజులో డ‌స్సెన్ (9), బ‌వుమా(20) ఉన్నారు. అయితే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఓట‌మి త‌ప్పించుకోవాలంటే మ‌రో 353 ప‌రుగులు చేయాలి.

కాగా అంత‌కుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాగా 95 ప‌రుగుల‌కే కుప్పకూలింది. కివీస్ బౌల‌ర్ మాట్ హెన్రీ 7 వికెట్లతో చెల‌రేగాడు. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఏ ఒక్క బ్యాట‌ర్ కూడా క‌నీసం 30 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. జుబేర్ హంజా 25 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. వెర్రెయిన్నే 18, మాక్ర‌మ్ 15, సరేల్ ఎర్వీ 10 మాత్ర‌మే రెండెంకెల స్కోర్ చేయ‌గ‌లిగారు. మిగ‌తా వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

Story first published: Friday, February 18, 2022, 14:16 [IST]
Other articles published on Feb 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+