దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం.. ప్రోటీస్ సెమీస్ ఆశలు ఖతం

బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సెమీఫైనల్‌కు చేరువైంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో పరాజయంను చవిచూసిన దక్షిణాఫ్రికా ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హిట్‌వికెట్‌గా గప్టిల్:
లక్ష ఛేదనలో న్యూజిలాండ్ బాగా ఇబ్బంది పడింది. రబడ వేసిన మూడో ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఓపెనర్ మున్రో (9) వెనుదిరగడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు విలియమ్సన్ (106 నాటౌట్; 138 బంతుల్లో 9×4, 1×6), గప్టిల్ (59 బంతుల్లో 35; 5 ఫోర్లు) కలిసి 60 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. ఈ సమయంలో భారీ షాట్ ఆడబోయి అదుపుతప్పిన గప్టిల్ తన కాలితోనే వికెట్లను తన్ని పెవిలియన్ చేరాడు.
గ్రాండ్‌హోమ్ జోరు:
అనంతరం 8 పరుగుల వ్యవధిలో మోరిస్ తన వరుస ఓవర్లలో టేలర్ (1), లాథమ్ (1) ఔట్ చేసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అయితే విలియమ్సన్‌కు నీషమ్ (23) అండగా నిలిచాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేసింది. ఈ దశలో నీషమ్‌ను ఔట్ చేయడం ద్వారా మోరిస్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే విలియమ్సన్‌కు తోడు గ్రాండ్‌హోమ్ (60; 47 బంతుల్లో 5×4, 2×6) దూకుడైన బ్యాటింగ్ కివీస్‌ను లక్ష్యం దిశగా నడిపింది.

కెప్టెన్ ఇన్నింగ్స్:
అయితే ఇద్దరూ కూడా ఔటయ్యే ప్రమాదాలను తప్పించుకున్నారు. ఇక చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంగిడి వేసిన 48వ ఓవర్ తొలి బంతికి గ్రాండ్‌హోమ్ ఔట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. చివరి బంతికి విలియమ్సన్ ఫోర్ బాదడంతో.. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. ఫెలుక్వాయో వేసిన చివరి ఓవర్ (49) తొలి బంతికి శాంట్నర్ సింగిల్ తీయగా.. విలియమ్సన్ సిక్స్‌తో స్కోరు సమం చేశాడు. ఇదే సమయంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో ఫోర్ కొట్టి విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో మోరిస్ మూడు వికెట్లు తీసాడు. విలియమ్సన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

ఆదుకున్న ఆమ్లా:
అంతకుముందు వర్షం కారణంగా ఒక ఓవర్ కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలలో 6 వికెట్లకు 241 పరుగులు చేసింది. ఓపెనర్ హషీం ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), వాన్ డర్ డుస్సెన్ (64 బం తుల్లో 67 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్ డికాక్ (5) త్వరగానే ఔట్ కాగా.. డుప్లెసిస్ (23), మర్‌క్రమ్ (38), డేవిడ్ మిల్లర్ (36) వేగంగా ఆడలేకపోయారు. ఇక కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications