
హైదరాబాద్: పాకిస్థాన్‌తో పాటుగా వన్డే మ్యాచ్‌లో తలపడిన న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌గా దిగిన మార్టిన్ గప్టిల్ (86 నాటౌట్)గా చెలరేగి అజేయ అర్ధ శతకంతో అదరగొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండోవన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో (డ/లూ పద్ధతిలో) విజయం సాధించింది.
నిర్దేశిత లక్ష్యాన్ని కివీస్ 23.5 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో కివీస్ 2-0తో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ 14 ఓవర్లలో 64 పరుగుల స్కోరు వద్ద రెండు గంటలపాటు వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
దీంతో లక్ష్యాన్ని 25 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. 11 ఓవర్లలో విజయానికి 87 రన్స్ కావాల్సిన తరుణంలో గప్టిల్, టేలర్ (45 నాటౌట్) చెలరేగడంతో మరో 7 బంతులు మిగిలుండగానే కివీస్ గెలిచింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.