Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొనసాగుతున్న ఓటమి పరంపర: తొలి టీ20లో పాక్ ఓటమి

New Zealand Vs Pakistan, 1st T20: Black Caps cruise

హైదరాబాద్: న్యూజిలాండ్‌లో పాకిస్థాన్ వరుస ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 0-5తో చేజార్చుకున్న పాకిస్థాన్ సోమవారం జరిగిన తొలి టీ20లో కూడా ఓటమి పాలైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 జరిగింది.

Pakistan vs New Zealand 2018 1st Twenty20 Score Card

వెల్లింగ్టన్‌లోని జీజే గార్డెనర్ హోమ్స్‌లో జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టు పాకిస్థాన్‌పై ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది.

38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో పాక్ బ్యాట్స్‌మెన్లు బాబర్ అజాం (41), హసన్ అలీ (23) పరుగులతో ఫరవాలేదనిపించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, సేథ్ రాన్స్ చెరో 3 వికెట్టు తీసుకోగా... శాంట్నర్ 2, మున్రో, కిచెన్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 15.5 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. లక్ష్య చేధనలో మార్టిన్ గుప్టిల్ (2), గ్లెన్ ఫిలిప్స్ (3) పరుగులకే వెనుదిరిగినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోలిన్ మున్రో (49) పరుగులతో హాఫ్ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన టామ్ బ్రూస్ (26), రాస్ టేలర్ (22 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలర్లలో రుమ్మాన్ రాయిస్ 2 వికెట్లు తీసుకోగా, షాదబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 13:29 [IST]
Other articles published on Jan 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+