Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand vs India: త‌గ్గెదేలే! ధోని, అజారుద్దీన్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మిథాలీ రాజ్‌

New Zealand vs India: Team India womens team captain Mithali Raj breaks Dhoni and Azharuddins records

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో టీమిండియా మహిళా టీం కెప్టెన్ మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క మ్యాచ్‌తో అనేక‌ రికార్డుల‌ను ఖాతాలో వేసుకుంది. ఈ క్ర‌మంలో టీమిండియా దిగ్గ‌జ కెప్టెన్లు అజారుద్దీన్, మ‌హేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ రికార్డుల‌ను సైతం బ‌ద్దలు కొట్టింది. అంతేకాకుండా అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి తాను అరంగేంట్రం చేశాక జ‌న్మించిన క్రీడాకారిణితో క‌లిసి ఏకంగా సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది.

అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు

న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డేలో హాఫ్ సెంచ‌రీతో రాణించిన మిథాలీ రాజ్ కివీస్‌పై అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో టీమిండియా మెన్స్ టీం దిగ్గ‌జ కెప్టెన్లు అజారుద్దీన్, మ‌హేంద్ర‌సింగ్ ధోని రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. రెండో వ‌న్డేలో మిథాలీ చేసిన సాధించిన‌ హాఫ్ సెంచ‌రీ ఆమె కెరీర్‌లో న్యూజిలాండ్‌పై ఏడ‌వ‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో అంత‌కుముందు ఆరేసి హాఫ్ సెంచ‌రీల‌తో ఉన్న అజారుద్దీన్, ధోనిని మిథాలీ అధిగ‌మించింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 4 హాఫ్ సెంచ‌రీల‌తో నాల్గో స్థానంలో ఉన్నాడు.

అత్య‌ధిక ప‌రుగులు

రెండో వ‌న్డేలో 66 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన మిథాలీ రాజ్ కివీస్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో టీమిండియా మెన్స్ టీం దిగ్గ‌జ కెప్టెన్లు మ‌హేంద్ర‌సింగ్ ధోని, అజారుద్దీన్ రికార్డులను సైతం అధిగ‌మించింది. ఈ జాబితాలో 739 ప‌రుగుల‌తో మిథాలీ తొలి స్థానంలో ఉండ‌గా, 723 ప‌రుగుల‌తో ధోని రెండో స్థానంలో, 678 ప‌రుగుల‌తో అజారుద్దీన్ మూడో స్థానంలో, 487 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో ఉన్నాడు.

 నాలుగేళ్ల త‌ర్వాత పుట్టిన రిచాతో సెంచరీ

నాలుగేళ్ల త‌ర్వాత పుట్టిన రిచాతో సెంచరీ

అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. తాను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరగేంట్రం చేశాక నాలుగేళ్ల త‌ర్వాత‌ జ‌న్మించిన రిచా ఘోష్‌తో క‌లిసి సెంచ‌రీ భాగ‌స్వామ్మాన్ని నెల‌కొల్పింది. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. 39 ఏళ్ల మిథాలీ రాజ్‌ 1999లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. మిథాలీ రాజ్ అడుగుపెట్టిన 4 సంవ‌త్సరాలు తర్వాత 2003లో రిచా ఘోష్ జ‌న్మించింది. కాగా కివీస్‌తో రెండో వ‌న్డేలో మిథాల్ రాజ్‌(66), రిచో ఘోష్ (65) క‌లిసి ఐదో వికెట్‌గా 108 ప‌రుగుల భాగ‌స్వామ్మాన్ని నెలకొల్పారు.

కివీస్ విజ‌యం

కివీస్ విజ‌యం

కాగా రెండో వ‌న్డేలో టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టుపై కివీస్ మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యం సాధించింది. కివీస్ ప్లేయ‌ర్ అమేలియా కెర్ అజేయ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ఆ జ‌ట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. దీప్తి శ‌ర్మ 4 వికెట్ల‌తో చెల‌రేగిన‌ప్ప‌టికీ టీమిండియాను విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక‌పోయింది. టీమిండియా బ్యాట‌ర్ల‌లో మిథాలీ రాజ్, రిచా ఘోష్ హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

స్కోర్లు:

భార‌త్: 270-6, న్యూజిలాండ్‌: 273-7.

Story first published: Wednesday, February 16, 2022, 10:32 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+