Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand vs India: టీ20 సిరిస్ విజేత ఎవరో తేల్చిచెప్పిన సన్నీ

India vs New Zealand : Gavasker Hope's That The Winner Of T20 Series Is India | Oneindia Telugu
New Zealand vs India: Sunil Gavaskar predicts the winner of the T20I series

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం మూడు టీ20ల సిరిస్‌పై కన్నేసింది. మూడు టీ20 సిరీస్‌ను కూడా గెలుచుకుని న్యూజిలాండ్ గడ్డపై మరోసారి తన సత్తాను చాటుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే కనీసం టీ20 సిరీస్‌ను గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ తహతహలాడుతోంది.

గవాస్కర్ మాట్లాడుతూ

గవాస్కర్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్ కంటే బలంగా ఉందని, టీ20 సిరీస్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంటుందని అన్నారు. మూడు టీ20ల సిరిస్‌ను 2-1 తేడాతో టీమిండియా కివీస్‌ను మట్టికరిపించే అవకాశం ఉందని గవాస్కర్ అంచనా వేశారు.

టీ20ల్లో కివీస్‌దే పైచేయి

అయితే గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే భారత్‌పై కివీస్‌దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై భార‌త జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టీ20 మ్యాచ్‌ను కూడా గెల‌వ‌లేదు. 2008-09 ప‌ర్య‌ట‌న‌లో ధోని సార‌థ్యంలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో ఓడిపోయింది. వెన్నుముక గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్ ఓపనర్ మార్టిన్ గప్టిల్ టీ20 సిరీస్‌కు దూరం కావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ

కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ

రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. చివరి రెండు వన్డేలతో పాటు న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు కూడా రోహిత్ శర్మనే నాయకత్వం వహించనున్నాడు. ఈ టీ20 సిరిస్‌లో రోహిత్ శర్మ మరో 36 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు.

అగ్రస్థానంలో మార్టిన్ గుప్తిల్

ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గుప్తిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, వెన్ను గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్తిల్‌.. టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు. గప్తిల్‌ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ జేమ్స్ నీషమ్‌ను న్యూజిలాండ్‌ జట్టులోకి తీసుకున్నారు.

Story first published: Tuesday, February 5, 2019, 16:30 [IST]
Other articles published on Feb 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+