
చెలరేగిన మిథాలీ, రిచా
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేశారు. కెప్టెన్ మిథాలీ రాజ్ 66 పరుగులతో అజేయంగా నిలిచింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 65 పరుగులు చేసింది. ఓపెనర్ సబ్భినేని మేఘన 49 పరుగులు చేసింది. యాస్తిక భాటియా 31, షఫాలీ వర్మ 24, పూజా వస్త్రాకర్ 11, హర్మన్ ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో దేవిన్ 2, జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, ఫ్రాన్ జోనాస్, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు.

సెంచరీతో చెలరేగిన అమేలియా
అనంతరం భారత్ విసిరిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మహిళలు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. దీంతో భారత్‌పై కివీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు బ్యాటర్ అమేలియా కెర్ అజేయ సెంచరీతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కివీస్ బ్యాటర్లలో అమేలియా కెర్ 119*, మ్యాడీ గ్రీన్ 52 పరుగులతో రాణించారు.
మిగతా వారిలో సోఫీ డివైన్ 33, కేటీ మార్టిన్ 20, సుజీ బేట్స్ 16, బ్రూక్ హాలిడే 13 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లతో సత్తా చాటింది. మిగతా వారిలో రాజేశ్వర్ గైక్వాడ్, పూనమ్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు 3-0తో అధిక్యంలోకి వెళ్లింది.

మిథాలీ రికార్డు
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మిథాలీ ఆడిన తన చివరి 9 వన్డేల్లో ఏకంగా 7 మ్యాచ్‌ల్లో 50కి పైగా స్కోర్లు సాధించింది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మహిళా బ్యాటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. గత 9 మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ స్కోర్లను పరిశీలిస్తే 66*, 59, 16, 8, 63, 75*, 59, 72, 79గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications
