జాదవ్‌తో మరాఠీలో, మురళీధరన్‌తో చాహల్‌ను పోల్చిన ధోని (వీడియో)


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ధోని సలహాలు పాటించి స్పిన్నర్లు అనేకసార్లు తమ ఖాతాల్లో వికెట్లు వేసుకున్న సందర్భాలు అనేకం. ధోని స్టంప్ మైక్స్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్‌తో గత ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో కేదార్ జాదవ్‌కి బంతి ఎక్కడ వేయాలో సలహా ఇచ్చాడు. ధోని చెబుతున్న మాటలను స్టంప్ మైక్‌లో నమోదయ్యాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ధోని మరాఠీలో జాదవ్‌కి సలహాలు ఇచ్చాడు. ఐదో వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేదార్ జాదవ్ 39వ ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్నాడు.
జాదవ్‌కు మరాఠీలో ధోని సలహాలు
ధోని వికెట్ల వెనుక నుంచి కేదార్ జాదవ్ మాతృభాష అయిన మరాఠీలో అరుస్తూ ‘పుఢే నాకో భావూ.. ఘెవూన్ టాక్' అని గట్టిగా అరిచాడు. దీని అర్థం ఏంటంటే ‘బంతి ముందుకు వేయొద్దు.. ఔట్ చేయి' అన్నమాట. ధోని మరాఠీలో మాట్లాడటం విని కేదార్ జాదవ్ ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మురళీధరన్‌తో చాహల్‌ను పోల్చిన ధోని
ఇదే ఐదో వన్డేలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో ధోని పోల్చాడు. ఈ సంఘటన జేమ్స్ నీషమ్ క్రీజులో ఉన్నప్పుడు యజువేంద్ర చాహల్ ఫీల్డింగ్‌ను సరిచేసే క్రమంలో చోటు చేసుకుంది. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉన్నాడు.
కుల్దీప్‌తో ధోని ముచ్చట
సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ అంఫైర్‌కు సమీపంలో స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. చాహల్‌ను ఉద్దేశించి కుల్దీప్‌తో మాట్లాడిన ధోని "బౌలింగ్ చూడు. ఫీల్డింగ్ సెట్టింగ్స్‌లో ముత్తయ్య మురళీధరన్ కంటే ఎక్కువగా బాధపడుతున్నాడు" అని జోక్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications