ఒకే ఓవర్లో 27 పరుగులు.. 23 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ!!

హామిల్టన్: ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ వీరవిహారం చేసాడు. ఆరో ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు.

రోహిత్ వీరవిహారం:
బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి లోకేష్ రాహుల్ సింగల్ తీసి రోహిత్ శర్మకు స్ట్రైక్ ఇచ్చాడు. రోహిత్ వరుసగా 6,6,4,4, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో రోహిత్ శర్మను ఎలా ఆపాలో అని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆపసోపాలు పడుతున్నాడు. మరోవైపు రాహుల్ కూడా చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. అయితే భారీ షాట్లు అదే క్రమంలో రాహుల్ (65), రోహిత్ (27) ఔట్ అయ్యారు.

12 ఇన్నింగ్స్‌ల్లో ఎనమిది సార్లు:
రోహిత్ కివీస్‌పై ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో ఎనమిది సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయ్యాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచాడు. టీ20లో 7, రెండో టీ20లో 8 పరుగులే చేసాడు. దీంతో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై పెద్దగా రాణించకపోవడం ఆందోళనకరంగా ఉండేది. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్ తన రికార్డును మార్చుకున్నాడు. ఇంకా రెండు టీ20లో కూడా చెలరేగితే ఇక తిరుగుండదు.

నిరాశపరిచిన దూబే:
రాహుల్ పెవిలియన్ చేరిన అనంతరం హిట్టర్ శివమ్ దూబే (3) క్రీజులోకి వచ్చాడు. అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్ అనంతరం శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ప్రస్తుతం12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కోహ్లీ (2), అయ్యర్ (1) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే తొలి రెండు టీ20లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications