వైరల్ వీడియో.. సూపర్ ఓవర్లో రోహిత్ సిక్సర్లు!!

హామిల్టన్: బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 'సూపర్ ఓవర్'లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆఖరి ఓవర్లో మహ్మద్ షమీ మ్యాజిక్, సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ డబుల్ సిక్సర్‌లతో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ గడ్డపై భారత్ తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మరో రెండు మ్యాచులు మిగిలుండగానే టీమిండియా 3-0తో సిరీస్‌ను సాధించి.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

మ్యాచ్ 'టై':
న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో 19వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా 11 పరుగులిచ్చుకోవడంతో.. 20వ ఓవర్లో కివీస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. షమీ తొలి బంతినే టేలర్ సిక్స్ కొట్టి కివీస్ విజయాన్ని ఖాయం చేసాడు. మరుసటి బంతికి ఒక పరుగు రావడంతో సమీకరణం కాస్త నాలుగు బంతుల్లో 2 పరుగులకు మారింది. మూడో బంతికి విలియమ్సన్ ఔట్ కాగా.. నాలుగు, ఇదో బంతుల్లో ఒక పరుగు వచ్చింది. చివరి బంతికి టేలర్ బౌల్డ్ కావడంతో స్కోర్లు సమమై మ్యాచ్ 'టై'గా ముగిసింది.

బుమ్రా విఫలం:
సూపర్ ఓవర్‌లోనూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. సూపర్ ఓవర్‌లో యార్కర్ కింగ్ బుమ్రా ప్రభావం చూపుతాడనుకుంటే పూర్తిగా తేలిపోయాడు. విలియమ్సన్ ఓ సిక్సర్, బౌండరీ బాదితే.. ఆఖరి బంతికి గప్తిల్ బౌండరీ సాధించడంతో కివీస్ 17 పరుగులు చేసింది. దీంతో టీమిండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది. ఛేదనలో కివీస్ పేసర్ టీమ్ సౌథీ పదునైన యార్కర్లు విసిరాడు. తొలి బంతికి రోహిత్ 2 పరుగులు తీశాడు. కానీ.. రనౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇక రెండో బంతికి ఒక పరుగే వచ్చింది. మూడో బంతిని ఆఫ్‌సైడ్ జరిగిన రాహుల్ బౌండరీ బాదాడు. అప్పటికి స్కోర్ 7/0.

సూపర్ ఓవర్లో రోహిత్ సిక్సర్లు:
నాలుగో బంతికి రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించినా.. సౌథీ యార్కర్ కారణంగా సింగిల్ మాత్రమే వచ్చింది. ఇక టీమిండియా చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాలి. ఆటగాళ్లు, అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. సౌథీ యార్కర్‌గా వేసిన ఐదో బంతిని రోహిత్ భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో సమీకరణం ఒక బంతికి 4 పరుగులుగా మారింది. చివరి బంతిని కూడా సౌథీ యార్కర్ వేయగా.. హిట్‌మ్యాన్ మరో భారీ సిక్స్ బాది టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.
నెట్టింట్లో వైరల్:
సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ బాదిన చివరి రెండు సిక్సర్ల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఎన్నో లైకులు, షేర్లు సాధించింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం. మీరూ ఓ లుక్కేయండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications