మూడో టీ20లో రోహిర్ వీరవిహారం.. కివీస్ లక్ష్యం 180

హామిల్టన్: ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యంను ఉంచింది. తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మ (65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు. హామిల్టన్ మైదానం పెద్దది అయినప్పటికీ సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ మూడు వికెట్లు తీసాడు.

రోహిత్ వీరవిహారం:
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు దాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. ముఖ్యంగా రోహిత్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. పేసర్ హామిష్ బెన్నెట్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ వీరవిహారం చేసాడు. ఆరో ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు.

ఒకే ఓవర్లో 27 పరుగులు:
ఆరో ఓవర్లో తొలి బంతికి రాహుల్ సింగిల్ తీసి రోహిత్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. తర్వాతి ఐదు బంతులన్నీ బౌండరీ లైన్ అవతల పడ్డాయి. హిట్‌మ్యాన్ ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 27 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో 23 బంతుల్లోనే అర్ధశ తకాన్ని పూర్తిచేసుకున్నాడు. టీ20 కెరీర్‌లో రోహిత్‌కిది 20వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. అయితే జట్టు స్కోరు 89 వద్ద రాహుల్ (27) పెవిలియన్ చేరాడు.

96 పరుగులకు మూడు వికెట్లు:
భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బెన్నెట్ వేసిన 11వ ఓవర్లో సౌతీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లలోనే 80 పరుగులకు పైగా చేసిన టీమిండియా ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (3) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

ఆదుకున్న మనీష్, జడేజా:
ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ (17) కూడా నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ చివరలో మనీష్ పాండే (14 నాటౌట్), రవీంద్ర జడేజా (10 నాటౌట్) స్కోర్ బోర్డును 179 పరుగులకు తీసుకెళ్లారు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ మూడు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications