
హామిల్టన్: ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. టిక్నర్ బదులుగా కుగ్‌లీన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్స్ కాంబినేషన్‌తోనే భారత్ బరిలోకి దిగుతోంది.
న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ చేజిక్కించుకునేందుకు టీమిండియా ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఇప్పటి వరకు రెండు సార్లు కివీస్ పర్యటనలో టీ20 సిరీస్‌లు కోల్పోయిన భారత్.. ఈసారి ట్రోఫీని ముద్దాడేందుకు సిద్దమయింది. వరుస విజయాలతో భారత జట్టు ఫామ్‌లో ఉండగా.. సీనియర్ బౌలర్ల గైర్హాజరులో న్యూజిలాండ్ బలహీనంగా తయారైంది. సొంతగడ్డపై పేలవ ఫామ్‌లో సతమతమవుతున్న కివీస్ ఇక్కడైనా పోరాడి సిరీస్ కాపాడుకోవాలని చూస్తోంది.
సెడాన్ పార్క్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నా.. వర్ష సూచన లేదు. గత ఐదు టీ20 మ్యాచ్‌లలో మూడు సార్లు జట్లు 190కి పైగా స్కోర్లు చేశాయి. ఏడాది క్రితం ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో కివీస్ 212 పరుగులు చేసి కూడా కేవలం 4 పరుగులతోనే భారత్‌పై గెలిచింది. అయితే హామిల్టన్ పిచ్‌పై చక్కటి రికార్డు ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. గతంలో ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడిన కివీస్.. ఏడింట విజయం సాధించింది.
Teams:
India (Playing XI): Rohit Sharma, Lokesh Rahul(w), Virat Kohli(c), Shreyas Iyer, Manish Pandey, Shivam Dube, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Yuzvendra Chahal, Jasprit Bumrah.
New Zealand (Playing XI): Martin Guptill, Colin Munro, Kane Williamson(c), Colin de Grandhomme, Ross Taylor, Tim Seifert(w), Mitchell Santner, Tim Southee, Scott Kuggeleijn, Ish Sodhi, Hamish Bennett.