మీకు తెలుసా?: న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాదు

హైదరాబాద్: గత వారం రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇండియా vs బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే.. న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ మాత్రం టెస్టు చాంపియన్‌షిప్‌లో లేదు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియగా... పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఫైనల్ సెషన్ వరకు జరిగింది. చివరకు ఈ మ్యాచ్‌లో న్యూజిలాండే విజయం సాధించింది.

కివీస్ విజయం సాధించినా..!
న్యూజిలాండ్ విజయం సాధించింది కదా ఆ జట్టు ఖాతాలో 60 పాయింట్లు చేరాయి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. టెస్ట్ చాంపియన్‌షిప్(2019-21) నిబంధన ప్రకారం ప్రతిజట్టూ ఆరు సిరీస్‌లు ఆడాలి.

స్వదేశంలో మూడు, విదేశంలో మూడు
ఇందులో స్వదేశంలో మూడు విదేశంలో మూడు ఉంటాయి. ఈ నిబంధన కారణంగానే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరిస్‌ను టెస్ట్ చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. ఈ సిరీస్‌ను గనుక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చేర్చితే.. ఇంగ్లాండ్ బయట ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సి వచ్చేది.

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో లేదు
దీంతో ఈ టెస్టు సిరీస్‌ను వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. ఈ సిరిస్‌ను టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చేర్చలేదు కాబట్టి న్యూజిలాండ్ గెలిచినా ఓడినా ఆ జట్టుకు పాయింట్లు రావు. మౌంట్ మాంగని వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ ఆ జట్టు ఖాతాలో పాయింట్లు చేరలేదు.

కివీస్ అభిమానులు అసంతృప్తి
దీంతో న్యూజిలాండ్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో కివీస్ ఆటగాడు వాట్లింగ్ డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications