Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ ఫైనల్లోనూ అంపైర్‌గా మళ్లీ అతనే!!

New Zealand vs England Final: Sri Lankan umpire Kumar Dharmasena appointed to stand in the World Cup final

లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరుగనున్నఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా కుమార ధర్మసేన (శ్రీలంక)నే అంపైర్‌గా ఎంపికయ్యారు. మారిస్‌ ఎరాస్మస్‌ (దక్షిణాఫ్రికా)తో కలిసి అతను ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మళ్లీ అతనే:

మళ్లీ అతనే:

గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కుమార ధర్మసేన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇక కీలక ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా కుమార ధర్మసేననే అంపైర్‌గా నియమించడం పట్ల ఐసీసీపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 థర్డ్‌ అంపైర్‌గా టకర్‌:

థర్డ్‌ అంపైర్‌గా టకర్‌:

ఫైనల్‌కు కుమార ధర్మసేన, మారిస్‌ ఎరాస్మస్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రాడ్‌ టకర్‌ (ఆస్ట్రేలియా) థర్డ్‌ అంపైర్‌గా ఎంపికయ్యాడు. కాగా, అలీమ్‌ దార్‌ (పాకిస్తాన్‌) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇదే బృందం గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎవరు గెలిచినా స‌రికొత్త ఛాంపియ‌న్ ప్ర‌పంచ క్రికెట్ తెర మీద ఆవిర్భ‌వించ‌బోతోంది.

రెండోసారి

రెండోసారి

కివీస్ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్టింది. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌డం న్యూజిలాండ్ జ‌ట్టుకు ఇది రెండోసారి మాత్ర‌మే. 2015లో తొలిసారిగా ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన కివీస్ టీమ్‌కు.. ఆస్ట్రేలియా అడ్డుప‌డింది. తొలిసారి ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతూ ఒత్తిడిలో ప‌డిన న్యూజిలాండ్‌ను త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేసి అయిదో సారి ఛాంపియ‌న్‌గా ఆవిర్భ‌వించింది. అయితే ఈ సారి తానేమిటో నిరూపించుకోవ‌డానికి స‌న్న‌ద్ధ‌మౌతోంది కేన్స్ సేన‌.

 నాలుగోసారి:

నాలుగోసారి:

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది నాలుగోసారి. ఇప్ప‌టిదాకా మూడుసార్లే ఆ జ‌ట్టు ఫైన‌ల్‌కు వెళ్ల‌గ‌లిగింది గానీ క‌ప్‌ను అందుకోలేక‌పోయింది. మ‌రోసారి త‌న అదృష్టాన్ని పరీక్షించుకోబోతంది. 1979లో వెస్టిండీస్ చేతిలో, 1987లో ఆస్ట్రేలియా చేతిలో, 1992లో పాకిస్తాన్ చేతిలో ప‌రాభ‌వాన్ని చ‌విచూసింది. తాజాగా 27 సంవ‌త్సరాల త‌రువాత తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌గ‌లిగింది. ఈ సారి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Story first published: Saturday, July 13, 2019, 9:30 [IST]
Other articles published on Jul 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+