Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2022లో తొలి సెంచ‌రీ న‌మోదు! తొలి వికెట్, ఫోర్, సిక్స్ వారి పేరు పైన‌..

New Zealand vs Bangladesh: Devon Conway First Century In 2022 year

2022లో కొత్త సంవ‌త్స‌రం రోజే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచ‌రీ న‌మోద‌యింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ డెవాన్ కాన్వే ఈ ఘ‌న‌త సాధించాడు. దీంతో 2022లో తొలి సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా కాన్వే రికార్డుల‌కుకెక్కాడు. అది కూడా జ‌న‌వ‌రి 1నే సాధించ‌డం విశేషం. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగానుయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కాన్వే సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. అలాగే ఈ సంవ‌త్స‌రంలో తొలి వికెట్ తీసిన బౌల‌ర్‌గా బంగ్లాదేశ్ ఆటగాడు షారిఫుల్ ఇస్లాం నిలిచాడు. న్యూజిలాండ్ ఓపెన‌ర్ టామ్ టామ్ లాథమ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా షారిఫుల్ ఈ ఘ‌న‌త సాధించాడు.

రెండో వికెట్‌కు సెంచ‌రీ భాగ‌స్వామ్యం

మౌంట్ మౌంగానుయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌ను ఆరంభంలోనే బంగ్లాదేశ్ బౌల‌ర్ షారిఫుల్ ఇస్లాం దెబ్బ‌కొట్టాడు. ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన టామ్ లాథ‌మ్‌ను షారిఫుల్ ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ ఒక్క ప‌రుగుకే వికెట్ కోల్పోయింది.

ఈ క్ర‌మంలో మ‌రో ఓపెన‌ర్ విల్ యంగ్, డేవాన్ కాన్వేతో క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 138 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. జ‌ట్టు స్కోర్ 139 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా.. 52 ప‌రుగులు (6 ఫోర్లు) చేసిన విల్ యంగ్ ర‌నౌట్ అయ్యాడు.

తొలి రోజు న్యూజిలాండ్‌దే

తొలి రోజు న్యూజిలాండ్‌దే

అనంత‌రం రాస్ టేల‌ర్‌తో క‌లిసి కాన్వే 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. స్కోర్ 189 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 31 ప‌రుగులు (5 ఫోర్లు) చేసిన రాస్ టేల‌ర్‌ను షారిఫుల్ ఔట్ చేశాడు. అనంత‌రం కాసేప‌టికే డేవాన్ కాన్వే సెంచ‌రీ పూర్తి చేశాడు. కివీస్ స్కోర్ 227 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 122 ప‌రుగులు చేసిన కాన్వే.. మోమినుల్ హక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 258 ప‌రుగుల వ‌ద్ద 11 ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్‌ టామ్ బ్లండెల్‌ను ఎబాడోత్ హుస్సేన్ ఔట్ చేశాడు.

అప్ప‌టికే స‌మ‌యం కూడా అయిపోవ‌డంతో అంపైర్లు తొలి రోజు ఆట‌ను ముగించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ జ‌ట్టు 258-5 స్కోర్‌తో నిలిచింది. తొలి రోజు ఆట‌లో కివీస్ జ‌ట్టు పై చేయి సాధించింది. మొత్తంగా తొలి రోజు ఆట‌ 87.3 ఓవ‌ర్లపాటు సాగింది.

సెంచ‌రీతో సంవ‌త్స‌రాన్ని ప్రారంభించిన‌ కాన్వే

న్యూజిలాండ్ ఆట‌గాడు డేవాన్ కాన్వే 2022 సంవ‌త్స‌రాన్ని సెంచ‌రీతో ప్రారంభించాడు. అంతేకాకుండా 2022లో సెంచ‌రీ న‌మోదు చేసిన తొలి ఆట‌గాడిగా నిలిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 227 బంతులు ఎదుర్కొన్న కాన్వే 122 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో గాయ‌ప‌డి కాన్వే 7 వారాలు జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకోని ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేయ‌డం విశేషం.

2022లో తొలి వికెట్ తీసిన షారిఫుల్

2022లో తొలి వికెట్ తీసిన షారిఫుల్

బంగ్లాదేశ్ బౌల‌ర్ షారిఫుల్ ఇస్లాం 2022లో తొలి వికెట్ తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. కివీస్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్ టామ్ లాథ‌మ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా షారిఫుల్ ఈ ఘ‌న‌త సాధించాడు. మొత్తంగా తొలి రోజు ఆట‌లో షారిఫుల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతేకాకుండా 2022లో తొలి ఫోర్ బాదిన బ్యాట‌ర్‌గా విల్ యంగ్, తొలి సిక్స్ బాదిన బ్యాట‌ర్‌గా డేవాన్ కాన్వే నిలిచారు.

Story first published: Saturday, January 1, 2022, 12:42 [IST]
Other articles published on Jan 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+