Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రెంట్ బౌల్ట్ , మహ్మదుల్లా పై ఐసీసీ కొరడా ...!

New Zealand Vs Bangladesh: Boult, Mahmudullah fined for misconduct

అంతర్జాతీయ క్రికెట్ ఆడే టప్పుడు జాతీయ ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో పెట్టు కోవాలి. లేకపోతే ఐసీసీ నుంచి తగిన మూల్యం చెల్లించు కొక తప్పదు. అయితే క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో వన్ డే లో ట్రెంట్ బౌల్ట్ , మహ్మదుల్లా పై ఐసీసీ జరిమానా విధించింది.

ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్ సందర్భంగా అసభ్యకరంగా మాట్లాడినందుకు తన మ్యాచ్ ఫీజు లో 15 శాతం జరిమానా విధించారు. అలాగే బాంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా మ్యాచ్ అయిపోయాక నిష్క్రమించే సమయం లో క్రికెట్ సామాగ్రిని ని పాడుచేయడంతో ఐసీసీ తన మ్యాచ్ ఫీజ్ లో 10 శాతం కోత విధించింది.

అయితే రెండో వన్ డే లో న్యూజిలాండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌(118) సెంచరీ సాధించి జట్టు ఘన విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(65 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

తొలి వన్డేలో కూడా గుప్టిల్‌(117) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.

Story first published: Monday, February 18, 2019, 13:52 [IST]
Other articles published on Feb 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+