న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతులు మారిన ఆధిక్యం, కివీస్ చేతిలో లంక చిత్తు

New Zealand v Sri Lanka: Hosts win by 423 runs for 1-0 series victory

హైదరాబాద్: ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చిన టెస్ట్‌లో కివీస్ 423 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఇలా టెస్ట్‌ల్లో వరుసగా నాలుగో సిరీస్ విజయాన్ని అందుకోవడం 88 ఏళ్ల సుదీర్ఘ కివీస్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ యేడాది వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్థాన్‌పై టెస్ట్ సిరీస్ విజయాలు సాధించిన కివీస్‌కు వరుసగా నాలుగో సిరీస్. న్యూజిలాండ్ నిర్దేశించిన 660 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 231/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ఇన్నింగ్స్ అనూహ్యంగా 14 బంతుల్లోనే ముగిసిపోయింది.

ట్రెంట్‌ బౌల్ట్‌ (3/77), వాగ్నర్‌ (4/48)లు మిగిలిన మూడు వికెట్లను 14 బంతుల్లో చేజిక్కుంచుకున్నారు. ఐదో రోజు ఆటలో గాయపడ్డ అంజెలో మాథ్యూస్ తిరిగి బ్యాటింగ్‌కు దిగలేదు. మొదట సురంగ లక్మల్(18), చమీరా(3)ను ట్రెంట్ బౌల్ట్(3/77) ఔట్ చేయగా, పెరెరా(22)ను వాగ్నర్(4/48) పెవిలియన్ పంపాడు.

రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన మాథ్యూస్‌ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ చేసిన సౌతీకి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వచ్చే నెల 3న మౌంట్‌ మాంగనిలో జరుగుతుంది

ఈ విజయంతో క్రికెట్ న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానం సాధించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇది చాలా కూల్ విక్టరీ. విజయం సాధించడం చాలా ఆనందంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, December 31, 2018, 8:13 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X