For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విలియమ్సన్‌ సెంచరీ, న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విక్టరీ

New Zealand v England: third ODI – as it happened

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్ వేదికగా మూడో వన్డే శనివారం ముగిసింది. ఈ వన్డేలో న్యూజిలాండ్‌‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 234 రన్స్ చేసింది.

నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఛేదించలేక ఓటమి పాలైంది. తద్వారా వరుసగా రెండో విజయాన్ని సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది ఇంగ్లాండ్. దీంతో మరో మ్యాచ్‌లో విజయాన్ని కొనసాగిస్తే సిరీస్‌ను చేజిక్కినట్లే.

వృథాగా పోయిన విలియమ్సన్ సెంచరీ:
మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ప్రధానంగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. విలియమ్సన్‌ 143 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

విలియమ్సన్‌కు మరో ఎండ్‌లో తగినంత సహకారం లభించలేదు. మిగతా న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో కొలిన్ మున్రో(49), సాంత్నార్‌(41)లు ఆకట్టుకున్నా జట్టును గెలిపించడంలో విఫలమైయ్యారు. న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, రషీద్‌ తలో రెండు వికెట్లు సాధించగా, మొయిన్‌ అలీ మూడు వికెట్లతో మెరిశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 234 పరుగులు చేసింది.

Story first published: Saturday, March 3, 2018, 16:24 [IST]
Other articles published on Mar 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+