Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌పై టెస్టు సిరిస్ నెగ్గి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

New Zealand survive for draw in first series win over England in 19 years

హైదరాబాద్: ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ టెస్టు సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో కనీసం డ్రాతోనైనా బయటపడాలంటే తప్పక నిలవాల్సిన మ్యాచ్‌లో కివీస్ అద్భుత ప్రదర్శన చేసింది. 34 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ను కివీస్‌ చేజిక్కించుకుంది.

England vs New Zealand 2018 2nd Test Score Card

గతంలో 1983-84లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను న్యూజిలాండ్‌ గెలిచింది. రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్‌కు పలుమార్లు వాతావరణం అడ్డంకిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు పర్యాటక ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (101) సెంచరీతో రాణించగా, మార్క్ వుడ్(52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

కివీస్ బౌలర్లలో టిమ్ సోథీ 6 వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్డ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలోవాట్లింగ్ (85), గ్రాండ్హోమ్ (72), టిమ్ సౌథీ హాఫ్ సెంచరీతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 6, జేమ్స్ ఆండర్సన్ 4 వికెట్లు తీసుకున్నారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 202/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 352/9 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం 382 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. చివరిరోజైన మంగళవారం ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లాథమ్, రావల్ ఐదో రోజు ఆటను ఆరంభించారు.

ఓపెనర్ లాథమ్(83) గొప్ప ఇన్నింగ్స్ ఆడి కివీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. చివరిరోజు న్యూజిలాండ్ విజయం సాధించడం కంటే మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకే ఎక్కువగా ప్రయత్నించింది. ఇందులో భాగంగా టెయిలెండర్లు గ్రాండ్‌హోమ్(45),ఇష్ సోధీ(56 నాటౌట్) తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ఇష్ సోధీ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. మంగళవారం ఆట ముగిసేసరికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 124.4 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి టెస్టును ఇన్నింగ్స్ 49 పరుగుల తేడాతో న్యూజిలాండ్ నెగ్గిన సంగతి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్:
ఇంగ్లాండ్: 307 ఆలౌట్
న్యూజిలాండ్: 278 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్:
ఇంగ్లాండ్: 352/9 డిక్లేర్
న్యూజిలాండ్: 256/8

మ్యాచ్ ఫలితం: డ్రా

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ట్రైంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించగా... టిమ్ సౌథీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Tuesday, April 3, 2018, 14:08 [IST]
Other articles published on Apr 3, 2018
Read in English: New Zealand thwart England
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+