Matt Henry: న్యూజిలాండ్ క్రికెట్ అవార్డులలో ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీకి సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకం లభించింది. ఇది కాకుండా మాట్ హెన్రీ న్యూజిలాండ్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపికయ్యాడు. ఇది కాకుండా న్యూజిలాండ్ స్టార్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్‌కు డెబ్బీ హాక్లీ పతకం లభించింది. ఈ అవార్డులు అందుకునే సందర్భంలో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఒకరి గురించి ఒకరిని ప్రశ్నలు అడిగినప్పుడు అమేలియా కెర్ ఒక ప్రత్యేక సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారా?.. అనే సందేహం అభిమానుల మనస్సుల్లో తలెత్తడం ప్రారంభమైంది.
సిగ్గుపడుతూ ఈ సమాధానం ఇచ్చిన అమేలియా కెర్..!
అవార్డుల ప్రధానోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ను మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి ఏమి ఇష్టమని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. మహిళా క్రికెటర్ సిగ్గుపడుతూ.. 'అతడి కళ్లు' అని చెప్పింది. అయితే మాట్ హెన్రీ ఈ ప్రశ్నను తప్పించుకుని క్రికెట్ గురించి మాట్లాడుకుందామని అన్నాడు. దీని తర్వాత మాట్ హెన్రీ, అమేలియా కెర్ డేటింగ్ లో ఉన్నారా అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కానీ డేటింగ్ గురించి వారిద్దరి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఉమెన్స్ ప్రీయయర్ లీగ్ 2025ను షేక్ చేసిన అమేలియా కెర్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025లో అమేలియా కెర్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున బౌలింగ్ చేస్తూ అమేలియా 18గ వికెట్లు పడగొట్టింది. ఇది కాకుండా.. ఈ క్రీడాకారిణి 2024 ప్రపంచకప్ లో కూడా అద్భుతంగా రాణించింది. ఈ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకోవడంలో న్యూజిలాండ్ తరపున అమేలియా కీలక పాత్ర పోషించింది. 2024 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అమేలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికైంది.