Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL Vs NZ: చివరి మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ గెలిచిన శ్రీలంక..

న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో శ్రీలంక 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. బుధవారం పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన డెడ్-రబ్బర్ పోటీలో ఆదివారం కేవలం 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టిమ్ రాబిన్సన్ ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ 21 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన సమయంలో వర్షం వచ్చింది.

ఆ తర్వాత వర్షం ఆగినప్పటికీ మ్యాచ్ జరిపే అవకాశం లేకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ 56 పరుగులు, హెన్రీ నికోల్స్ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ వరణుడు అడ్డుపడడంతో మ్యాచ్ క్యాన్సల్ అయింది. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్‌కి ఒక వికెట్ పడింది. అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్ ల్లో శ్రీలంక ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.

New Zealand-Sri Lanka match called off due to rain

న్యూజిలాండ్ భారత్ జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం సత్తా చాటింది. మూడు టెస్టుల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కానీ శ్రీలంక మాత్రం ఆ జట్టు తడబడింది. ఇటు భారత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది.

ఇరు జట్లు
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికె), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (సి), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, దిల్షన్ మదుశంక, అసిత ఫెర్నాండో, నిషాన్ హేమ్ పెరీరా, నిషాన్ హేమ్ పెరీరా, , దునిత్ వెల్లలగే, మహ్మద్ షిరాజ్, చమిందు విక్రమసింఘే.

న్యూజిలాండ్:
విల్ యంగ్, టిమ్ రాబిన్సన్, హెన్రీ నికోల్స్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచ్ హే (WK), మిచెల్ సాంట్నర్ (c), నాథన్ స్మిత్, ఇష్ సోధి, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, జోష్ క్లార్క్సన్ , జకరీ ఫౌల్కేస్.

Story first published: Wednesday, November 20, 2024, 10:43 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+