New Zealand Squad For England Test Series: ఇంగ్లాండ్ పర్యటన కోసం 15మందితో న్యూజిలాండ్ టెస్ట్ టీం ఇదే!

ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గురువారం (జూన్ 2) నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు మైఖేల్ బ్రేస్‌వెల్ స్టాండప్ ప్లేయర్‌గా (16వ ప్లేయర్)గా ఎంపికయ్యాడు. ఇక బ్రేస్‌వెల్‌ను హెన్రీ నికోల్స్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకున్నారు. హెన్రీ నికోల్స్ ఇప్పటికీ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే తొలుత న్యూజిలాండ్ 20మందితో కూడిన జట్టును ప్రకటించింది.
అందులో నుంచి జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను మళ్లీ తప్పించి 15మందితో కూడిన తుది జట్టును ప్రకటించింది. ఇక తుది జట్టులో అజాజ్ పటేల్ కూడా చేరాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియాతో జరిగిన టెస్టులో ఈ కివీస్ స్టార్ భారత్‌పై పది వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

మొదటి టెస్ట్‌కు ట్రెంట్ బౌల్ట్ దూరం
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తుది జట్టును ప్రకటించింది. ఇకపోతే న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఓపెనింగ్ టెస్ట్‌కు అందుబాటులో ఉండడు. ట్రెంట్ బౌల్ట్ ఇంకా లండన్‌కు చేరుకోనందున మొదటి టెస్ట్ ఆడేందుకు అవకాశం లేదు. ఇక మే 29న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ట్రెంట్ బౌల్ట్ ఆడిన సంగతి తెలిసిందే.
ఇక మధ్యలో తగినంత వ్యవధి లేనందున బౌల్ట్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్‌కు ముందు డారిల్ మిచెల్ రాజస్థాన్ జట్టు నుంచి వైదొలిగినందున సోమవారం న్యూజిలాండ్ జట్టులో చేరాడు. అతను మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండొచ్చు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ తొమ్మిదవ స్థానంలో..
ఇకపోతే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పట్టికలో ఇంగ్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉంది. కాబట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇక న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కొడుకు పుట్టడంతో ఈ వారం ప్రారంభంలో అతను జట్టులో చేరాడు. ఇకపోతే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా 2, ఇండియా 3, శ్రీలంక 4, పాకిస్థాన్ 5, వెస్టిండీస్ 7, బంగ్లాదేశ్ 8 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

న్యూజిలాండ్ జట్టు
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ ప్రకటించిన జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, క్యామ్ ఫ్లెచర్ (వికెట్ కీపర్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్ , అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications