Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూటీసీ ఫైనల్ విన్నింగ్ ఫార్ములాతో న్యూజిలాండ్: టీమిండియాపై స్పిన్ ఉచ్చు

New Zealand’s winning formula for Kanpur test, likely to play 3 spinners against India

ముంబై: భారత క్రికెట్ జట్టు.. తన టెస్ట్ సిరీస్‌ వేటను మొదలు పెట్టబోతోంది. ఇంటర్నేషనల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇది ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్‌ను తలపడబోతోంది. తొలి టెస్ట్‌కు ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక కానుంది. అయిదు సంవత్సరాల తరువాత తొలి టెస్ట్ మ్యాచ్‌ ఇక్కడ షెడ్యూల్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ స్టేడియంలో భారత జట్టు చివరిసారిగా 2016లో టెస్ట్ మ్యాచ్ ఆడింది.

2016లో న్యూజిలాండ్‌పైనే..

2016లో న్యూజిలాండ్‌పైనే..

2016లో ఇదే న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టింది. విజయాన్ని అందుకుంది. 216 పరుగుల భారీ తేడాతో బ్లాక్ క్యాప్స్‌ను ఓడించింది. కివీస్‌ టీమ్‌కు ఏ మాత్రం అచ్చిరాని పిచ్ ఇది. ఈ స్టేడియంలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంతకుముందు 1983లో చివరిసారిగా టీమిండియా.. వెస్టిండీస్‌ను ఢీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. 1952లో భారత్-ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి సారిగా ఈ పిచ్‌పై టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఆ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది.

టీమిండియా సక్సెస్ ట్రాక్ ఎక్కువే..

టీమిండియా సక్సెస్ ట్రాక్ ఎక్కువే..

కాన్పూర్ పిచ్.. టీమిండియాకు బాగా అచ్చి వచ్చింది. విజయాల ట్రాక్ రికార్డు అధికం. మొత్తం 22 టెస్ట్ మ్యాచ్‌లు ఇక్కడ జరగ్గా- ఏడింట్లో భారత్ విజయం సాధించింది. మూడింట్లో మాత్రమే ఓడింది. మిగిలిన 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తన ట్రాక్ రికార్డును కొనసాగించడానికి భారత్ కఠోరంగా శ్రమిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తనను ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి, కాన్పూర్ పిచ్‌పై తన చెరిగిపోని రికార్డును కొనసాగించడానికి నెట్స్‌లో చెమటోడుస్తోంది.

అదే విన్నింగ్ ఫార్ములాతో..

అదే విన్నింగ్ ఫార్ములాతో..

న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఇంగ్లాండ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను చిత్తు చేసింది కేన్ విలియమ్సన్ టీమ్. అదే విన్నింగ్ ఫార్ములాతో న్యూజిలాండ్ తొలి టెస్ట్ బరిలో దిగే అవకాశం ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్ కావడం వల్ల ముగ్గురు స్పిన్నర్లకు తుది జట్టులో చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

సుదీర్ఘ ఇన్నింగ్‌పై

సుదీర్ఘ ఇన్నింగ్‌పై

భారత్‌లో టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఇప్పటిదాకా తాము ఆడిన క్రికెట్‌ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని గ్యారీ స్టీడ్ చెప్పారు. ఇదివరకు అహ్మదాబాద్, చెన్నైల్లో టెస్ట్ మ్యాచ్‌లను ఆడామని, సుదీర్ఘ విరామం అనంతరం కాన్పూర్ పిచ్‌పై అడుగు పెట్టబోతున్నామని అన్నారు. మిగిలిన స్టేడియాలతో పోల్చితే.. కాన్పూర్ పిచ్‌కు ఉన్న తేడా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ముగ్గురు స్పిన్నర్లను బరిలో దించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడగల..అదే స్థాయిలో బౌలింగ్‌ను సంధించే ప్లేయర్లను తుదిజట్టులోకి తీసుకుంటామని అన్నారు.

Story first published: Wednesday, November 24, 2021, 13:14 [IST]
Other articles published on Nov 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+