Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌ లెస్బియన్ క్రికెటర్లకు బేబీ గర్ల్!!

New Zealand’s Amy Satterthwaite and Lea Tahuhu announce birth of baby girl

ఆక్లాండ్: న్యూజిలాండ్‌ మహిళా జట్టు ప్లేయర్లు, లెస్బియన్ క్రికెటర్స్ ఆమీ సెటర్త్‌వైట్, లియా తహుహులకు ఓ పండంటి పాప జన్మించింది. సోమవారం తమ కుటుంబలోకి బేబీ గర్ల్ వచ్చిందని లియా తహుహు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. బేబీ గర్ల్ రాకతో క్రికెట్‌లో తొలి లెస్బియన్ జంటగా నిలిచిన అమీ సెటర్త్‌వైట్-లియా తహుహుకు కొత్త ఏడాది మరపురానిదిగా మారింది.

 చాలా ఆనందంగా ఉన్నాం:

చాలా ఆనందంగా ఉన్నాం:

లియా తహుహు తనకు పాప పుట్టిందని గురువారం తెలిపింది. 'జనవరి 13న మా జీవితంలోకి పాప వచ్చింది. గ్రేస్ మేరీ సాటర్త్‌వైట్‌ రాకను ప్రకటించడాన్ని అమీ, నేను సంతోషిస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నాం' అని తహుహు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. శిశువు యొక్క చేతులను పట్టుకున్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తా:

క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తా:

'కొత్త సంవత్సరం ప్రారంభంలో మా మొదటి బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడం కోసం లీ, నేను చాలా ఆతృతగా ఉన్నాం. ఇది మా జీవితంలో ఒక ప్రత్యేక సందర్భం. కొత్త అధ్యాయం కోసం వేచి ఉండలేము. కివీస్ బోర్డు నుండి అందిన సహకారం, మద్దతు చాలా గొప్పది. ఆటకు ఇంకా ఎదో చేయాలనుంది. వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తా' అని అమీ పేర్కొంది.

తొలి లెస్బియన్ జంటగా అమీ-లియా:

తొలి లెస్బియన్ జంటగా అమీ-లియా:

2010లో తహుహుకు సాటర్త్‌వైట్ పరిచయం అయింది. 2013లో తమ మధ్య ఉన్న బంధం గురించి ప్రపంచానికి చెప్పారు. 2014లో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. న్యూజిలాండ్‌లో ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) మధ్య జరిగే వివాహాలు చట్టబద్ధమే. ఈ క్రమంలో అమీ-లియా మూడు సంవత్సరాల తర్వాత 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. దీంతో పెళ్లి చేసుకున్న తొలి లెస్బియన్ జంటగా నిలిచారు.

క్రికెట్ ప్రపంచంలో మరికొన్ని జోడీలు:

క్రికెట్ ప్రపంచంలో మరికొన్ని జోడీలు:

అమీ-లియా పెళ్లి అనంతరం క్రికెట్ ప్రపంచంలో మరికొన్ని జోడీలు కూడా ఒక్కటయ్యాయి. న్యూజిలండ్ ప్లేయర్ హీలీ జెన్సెన్-నికోలా హాన్‌కాక్, సౌతాఫ్రికా ప్లేయర్ డేన్ వాన్ నీకెర్క్-మారిజాన్నే కాప్ మధ్య లెస్బియన్ వివాహాలు జరిగాయి. ఇక కివీస్ క్రికెట్ బోర్డు కొత్త నిబంధనల ప్రకారం వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవుని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమీ శాటర్త్‌వైట్‌ అరుదైన ఘనత సాధించింది.

Story first published: Friday, January 17, 2020, 15:53 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+