క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌కు చెందిన ఓ రోబో.. ఐసీసీ ప్రపంచ కప్ 2015లో విజేత ఆప్ఘనిస్తాన్ అని చెప్పింది. అగ్రశ్రేణి జట్లను కాదని క్రికెట్ పసికూన ఆప్ఘనిస్తాన్ ఈసారి ప్రపంచకప్ గెలుస్తుందని రోబో చెప్పడం గమనార్హం. న్యూజిలాండులోని కాంటర్ బరీ విశ్వవిద్యాలయానికి చెందిన రోబో ఇక్రమ్ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.
టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 14 జట్ల జాతీయ పతాకాలను తదేకంగా పరిశీలించిన ఈ రోబో... ఆఫ్ఘనిస్తాన్ వైపు మొగ్గు చూపింది. టోర్నీలో ఆప్ఘనిస్తాన్ గెలిచే అవకాశాలు చాలా తక్కువైనప్పటికీ, క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని రోబో సృష్టికర్త ఎడ్వర్డో సాండోవల్ అన్నారు.

ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు
ప్రపంచ కప్ 2015 ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీ సమాచారంతో కూడిన 5 ల్యాప్‌టాప్‌లు చోరీకి గురయినట్లు గుర్తించారు. న్యూజిలాండులోని క్రైస్ట్‌చర్చ్‌లో ఉన్న హాగ్లే నెట్ బాల్ సెంటరుకు చెందిన అక్రిడిటేషన్ సెంటర్ నుండి వీటిని దొంగిలించారు.
దొంగతనం జరిగిన విషయాన్ని కాంటర్బరీ జిల్లా కామాండర్ సూపరింటెండెట్ గ్యారీ నోల్స్ నిర్ధారించారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ భద్రతా ఏర్పాట్ల పైన ఈ ఘటన ప్రభావం చూపదని చెప్పారు. ల్యాప్‌టాప్‌లకు పటిష్టమైన రక్,ణ వ్యవస్థ ఉందని, ప్రమాదం లేదని చెప్పారు. ల్యాప్‌టాప్‌లలో ఉన్న సమాచారం ఏమంత కీలకమైంది కాదన్నారు.