ధర్మశాల: ప్రపంచ టీ20 టోర్నమెంటులో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ జట్టు అనూహ్య విజయం సాధించింది. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక నిర్ణీత 20ఓవర్లలో 138 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో 8 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది.
ఓపెనర్లుగా వచ్చిన ఖవాజా 38 పరుగులతో రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం కావడం విశేషం. 38 పరుగులు చేసిన ఖవాజా.. రనౌటయ్యాడు. ఆ తర్వాత వాట్సన్ 13, స్మిత్ 6, వార్నర్ 6, మాక్స్‌వెల్ 22, మార్ష్ 24, అగర్ 9, ఫాల్కూనర్ 2, కూల్టర్ నైల్ 1 పరుగులకే ఔటయ్యారు. నెవిల్ 7, జంపా 2 పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా, కివీస్ బౌలర్లలో మెక్‌లెన్ 3 వికెట్లు పడగొట్టగా, అండర్సన్, సంట్నర్ 2, సోది 1 వికెట్ తీశారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది.

ఓపెనర్లుగా వచ్చిన గుప్తిల్ 39, విలియమ్సన్ 24 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత మన్రో 23, అండర్సన్ 3, టేలర్ 11, ఇల్లియట్ 27, రోంఛి 6, పరుగులు చేసి ఔటయ్యారు. సంట్నర్ 1, మిల్నే 2 పరుగులతో అజేయంగా నిలిచారు. కివీస్ బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా భారీ స్కోరు చేయకపోవడం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా బౌలర్లో ఫాల్కూర్, మాక్స్‌వెల్ తలో రెండు వికెట్ల పడగొట్టగా, వాట్సన్, మార్ష్‌లు చెరో వికెట్ తీశారు.