Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటో స్టోరీ: ధోని కారులో వెళుతుంటే కివీస్ ఆటగాళ్లు నోరెళ్లబెట్టారు

రాంచీ: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో పాల్గొనేందుకు గాను భారత్, న్యూజిలాండ్ జట్లు సోమవారం రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్రమంలో అక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు తాము బసచేసే హోటల్‌కు వెళ్లేందుకు గాను బస్సులో బయటకు వచ్చారు. రాంచీ... ధోని సొంత నగరం కావడంతో ఇరు జట్లు అక్కడికి చేరుకునే లోపే ధోని కోసం అతడి కుటుంబ సభ్యులు హమ్మర్ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు.

అదే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బస్సులో ప్రయాణించగా, ధోని మాత్రం తన హమ్మర్ వాహనంలో ఇంటికి చేరుకున్నాడు. ధోని తన హమ్మర్ వాహనంలో కూర్చొని ఉండగా బస్సులో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు నోరెళ్లపెట్టి ధోనివైపు చూస్తున్న ఫోటో ఇది.

New Zealand players look on as Captain Dhoni leaves in a car

కాగా, ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్యాంగా ఆరు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. ఇక కీలకమైన మూడో వన్డేలో ధోని 80 పరుగులతో రాణించగా, కోహ్లీ (154 నాటౌట్) పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాంచీలో 4వ వన్డే: కోహ్లీ మెరుగైన రికార్డు, గెలుపు భారత్‌దే!

దీంతో సిరిస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిపారు. ఈ క్రమంలో నాలుగో వన్డేలో కూడా అదే జోరుని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌‌లో గెలిచి సిరిస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే న్యూజిలాండ్ భావిస్తోంది. నాలుగో వన్డేలో గెలుపు భారత్ కంటే న్యూజిలాండ్‌కు ఎంతో అవసరం.

ఇప్పటికే జరిగిన టెస్టు సిరిస్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో వైట్ వాష్ అయింది. ఎలాగైనా సరే వన్డేల్లో గెలవాలనే పట్టుదలతో విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ జట్టు పట్టుదలతో ఉంది. దీంతో బుధవారం రాంచీలో జరిగే మ్యాచ్‌ని ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+