IPL 2022: ఆర్సీబీలోకి కివీస్ స్టార్ ప్లేయర్లు డేవాన్ కాన్వే, ట్రెంట్ బౌల్ట్! ధర ఎంతంటే..

ఐపీఎల్ మెగా వేలానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. ఏ ఆటగాడిని ఎంత ధరకు కొనుగోలు చేయాలనే అంశాలపై కూడా ఓ అంచనాకు వచ్చాయి. తాము అనుకున్న వ్యూహాలు అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే మంచి మంచి ఆటగాళ్లను వేలంలో దక్కించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ క్రమంలో వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయబోయే ఆటగాళ్ల గురించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కివీస్ ఆటగాళ్లపై కన్ను
ఐపీఎల్ మెగా వేలంలో ఇద్దరు కివీస్ ఆటగాళ్లపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కన్నేసిందని సమాచారం. వారిద్దరు డేవాన్ కాన్డే, ట్రెంట్ బౌల్ట్‌గా తెలుస్తోంది. వీరిద్దరిని వేలంలో ఎలాగైనా దక్కించుకోవాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ డిసైడ్ అయిందట. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో వీరిద్దరు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో వీరు తమ జట్టులో ఉంటే బాగుంటుందని ఆర్సీబీ భావిస్తోందట. మంచి బ్యాటర్‌గా అయినా డేవాన్ కాన్వే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక బౌల్ట్ కూడా అంతర్జాతీయ క్రికెట్ రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బౌల్ట్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాగా డేవాన్ కాన్వే ఐపీఎల్‌లో పాల్గొనడం ఇదే మొదటి సారి.

సన్‌రైజర్స్ నుంచి పోటీ
డేవాన్ కాన్వే, ట్రెంట్ బౌల్ట్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆర్సీబీకి గట్టి పోటీ తప్పేలా కనపించడం లేదు. ఆ జట్టు కూడా మెగా వేలంలో వీరిద్దరిని కొనుగోలు చేయాలని పట్టుదలగా ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్ న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సనే కావడంతో కాన్వే, బౌల్ట్‌ను వేలంలో కొనుగోలు చేయాలని టీం మేనేజ్‌మెంట్‌కు సూచికంచాడట. దీంతో మెగా వేలంలో డేవాన్ కాన్వే, ట్రెంట్ బౌల్ట్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు ఆడిన ట్రెంట్ బౌల్ట్ 76 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/18 గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో 301, వన్డేల్లో 169, టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. కొంతకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డేవాన్ కాన్వే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఆడలేదు. కాగా 5 టెస్టుల్లో 69 సగటుతో 623 పరుగులు, 3 వన్డేల్లో 75 సగటుతో 225 పరుగులు, 20 టీ20ల్లో 50 సగటుతో 602 పరుగులు చేశాడు.

ధర ఎంతంటే?
ప్రస్తుతం మెగా వేలంలో డేవాన్ కాన్వే, ట్రెంట్ బౌల్ట్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఉన్న ఫామ్ దృష్యా భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. డేవాన్ కాన్వే 8 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసే ఆలోచనలో ఆర్సీబీ ఉందట. అదే సమయంలో ట్రెంట్ బౌల్ట్‌కు 6 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు చెల్లించడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications