Ross Taylor: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాడు

క్రికెట్‌లో మరో దిగ్గజ ఆటగాడి శకం ముగిసింది. తాజాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని టేలరే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశాడు. ఈ వేసవి ముగింపులో తన స్వదేశమైన న్యూజిలాండ్‌లో జరిగే మ్యాచ్‌లు తన కెరీర్‌లో చివరివని ప్రకటించాడు. ఈ వేసవి ముగింపులో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లు.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌తో జరిగే 6 వన్డే మ్యాచ్‌లే ఇక తన కెరీర్‌లో చివరివని టేలర్ వెల్లడించాడు. తన 17 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ టేలర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉందని టేలర్ పేర్కొన్నాడు.
టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టు సభ్యుడు
37 ఏళ్ల రాస్ టేలర్ 17 సంవత్సరాలుగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నాడు. కివీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ప్రపంచంలోని ఎందరో దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడాడు. కొంత కాలం పాటు న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టులో రాస్ టేలర్ కీలక సభ్యుడు. అంతేకాకుండా తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో టేలర్ కీలక ఆటగాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్ ప్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ 2006లో అడుగుపెట్టాడు. ఆ ఏడాది మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్ ప్రస్థానం మొదలైంది. 2006లోనే డిసెంబర్ 22న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక 2007లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2007లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా టేలర్ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

టేలర్ రికార్డులు
ఈ క్రమంలో ఇప్పటివరకు టేలర్ 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 44 సగటుతో 7,585 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 290. అదే క్రమంలో 233 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 48 సగటుతో 8576 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్:181. ఇక 102 టీ20 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 1909 పరుగులు చేశాడు. 7 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అత్యధిక స్కోర్:63. టేలర్ ఐపీఎల్ కూడా ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో 25 సగటుతో 1017 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్: 81 పరుగులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications