Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ ఓపెనర్

New Zealand opening batsman Rob Nicol announces retirement from all forms of cricket

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో ఓపెనర్ తప్పుకున్నాడు. న్యూజిలాండ్ హార్డ్‌హిట్టర్ మార్టిన్ గప్తిల్‌తో కలిసి విధ్వంసం సృష్టించిన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రాబ్ నికోల్ 17ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నికోల్, గప్తిల్ కలిసి న్యూజిలాండ్‌కు చాలాసార్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. 35ఏళ్ల నికోల్ కివీస్ తరఫున రెండు టెస్టులు, 22 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

50ఓవర్ల ఫార్మాట్‌లో రెండు సెంచరీలు సాధించి 941 పరుగులు చేశాడు. అరంగేట్ర వన్డే మ్యాచ్‌లోనే జింబాబ్వేపై సెంచరీతో చెలరేగి ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున అరంగేట్రంలోనే సెంచరీ బాదిన రెండో ఆటగాడు నికోల్. అంతకుముందు ఈ రికార్డును ఓపెనర్ మార్టిన్ గప్తిల్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 2010 ఐసీసీ టీ20 వరల్డ్ సందర్భంగా వెస్టిండీస్‌తో మాచ్‌లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2013లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన కివీస్‌కు నికోల్ ప్రాతినిధ్యం వహించాడు.

దేశీయ క్రికెట్‌లోనూ చాలా మ్యాచ్‌లు ఆడి అతనొక సాలిడ్ ఆల్ రౌండర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఫేస్, స్పిన్ బౌలింగ్‌లను ప్రదర్శించి 43 వికెట్లు తీశాడు. దేశీవాలీ క్రికెట్ మ్యాచ్‌లలో.. ఆక్లాండ్, కాంటర్‌బెర్రీ ఒటాగో లీగ్ లలో పాల్గొన్నాడు. ఇతనికి వీటితో పాటుగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లోనూ ఆడిన అనుభవం ఉంది. ఆడిన 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో.. 6319 పరుగులను చేశాడు. వీటిల్లో పది సెంచరీలు, 43వికెట్లు ఉన్నాయి.

రాబ్ నికోల్ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత న్యూజిలాండ్ కు చెందిన మరో క్రికెటర్ మైక్ హెస్సన్ కూడా తను పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలాఖరులోగా తప్పుకోనున్నట్లు సమాచారం.

Story first published: Sunday, June 10, 2018, 13:28 [IST]
Other articles published on Jun 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+