T20 World Cup: వాళ్లపై వేటు.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం వెల్లడించింది. ఈ మహా సమరానికి అందరి కంటే ముందే జట్టును ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన కివీస్ జట్టులో సంచలన నిర్ణయాలేమి లేవు. ఊహించినట్లుగానే ఫామ్‌లేని కొందరు ఆటగాళ్లపై వేటు వేసింది. గాయపడిన మరికొందరు ప్లేయర్లను పక్కనపెట్టింది.
గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్, ఆల్‌రౌండర్ ఆడమ్ మిల్నే దూరమయ్యారు. ఫామ్‌లో లేని విల్ ఒరూర్క్, టామ్ లాథమ్, టిమ్ సీఫెర్ట్‌ను సెలక్టర్లు పక్కనపెట్టారు. మరోవైపు కేన్ విలియమ్సన్‌తో పాటు అనుభవజ్ఞులు టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్‌ను ప్రపంచకప్ జట్టులో చేర్చారు. విలియమ్సన్‌కు ఆటగాడిగా ఇది ఆరో, సారథిగా నాలుగో టీ20 వరల్డ్ కప్ కానుంది.

టిమ్ సౌథికి ఇది ఏడో టీ20 ప్రపంచకప్ కానుండటం విశేషం. కాగా, ఈ సారి పొట్టి కప్‌ను తప్పక సాధించాలని న్యూజిలాండ్ ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్‌లో యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర ఫామ్‌లో లేకపోయినప్పటికీ, ఆస్ట్రేలియా సిరీస్‌లో చేసిన ప్రదర్శన కారణంగా ఎంపిక చేసింది. మ్యాట్ హెన్రీ కూడా అవకాశం ఇచ్చింది. రిజర్వ్ ప్లేయర్‌గా బెన్ సియర్స్‌ను సెలక్ట్ చేసింది.
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 7న గయానా వేదికగా అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-సీలో ఉన్న కివీస్ అఫ్గాన్‌తో పాటు వెస్టిండీస్, ఉగాండా, పాపువా న్యూగినియాతో తలపడనుంది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి.
ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications