Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పురుషుల టీ20 ఇంటర్నేషనల్స్‌లో తొలి మహిళా అంపైర్

అక్లాండ్: క్రికెట్‌లో ఇక మహిళా అంపైర్ల హవా మొదలైనట్టే కనిపిస్తోంది. విమెన్ క్రికెట్‌ మ్యాచ్‌లల్లో కూడా ఇప్పటివరకు పురుష అంపైర్లే ఉంటోన్నారు. దీనికి తెర దించారు కిమ్ కాటన్. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లల్లో పూర్తి స్థాయి మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. డ్యునెడిన్‌లో న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేశారు. తోటి ఫీల్డ్ అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి గ్రౌండ్‌లో కనిపించారు.

48 సంవత్సరాల కిమ్ కాటన్.. న్యూజిలాండ్‌ దేశస్థురాలు. 2018 నుంచి తన కేరీర్‌లో 54 టీ20 ఇంటర్నేషనల్స్, 24 వన్డే ఇంటర్నేషనల్స్‌‌లల్లో టీవీ అంపైర్‌, ఫీల్డ్ అంపైర్‌గా పని చేసినప్పటికీ.. అవన్నీ విమెన్ క్రికెట్ మ్యాచ్‌లే. తొలిసారిగా 2020లో హామిల్టన్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో ఆమె మొదటిసారిగా టీవీ అంపైర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా గ్రౌండ్‌లో అడుగు పెట్టారు.

kim cotton first women umpire


ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లల్లో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా-37, కుశాల్ పెరీరా-35, చరిత్ అసలంక-24, కుశాల్ మెండిస్-10 పరుగులు చేశారు. న్యూజిలాండ్ ఏస్ బౌలర్ ఆడమ్ మిల్నె అయిదు వికెట్లు కూల్చాడు. తన నాలుగు వికెట్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. బెన్ లిస్టర్-2 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ చెలరేగింది. 14.4 ఓవర్లల్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు ఛాద్ బోవెర్స్-31, టిమ్ సీఫర్ట్-79, టామ్ లాథమ్-20 పరుగులు చేశారు. 43 బంతుల్లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో టిమ్ సీఫర్ట్ 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లెవరూ రాణించలేదు. కసున్ రజిత ఒక్కడే ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు.

Story first published: Wednesday, April 5, 2023, 10:29 [IST]
Other articles published on Apr 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+