Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే సిరీస్‌కు స్టార్ పేస్ త్రయం దూరం.. న్యూజిలాండ్‌ జట్టు ఇదే!!

New Zealand Injured Pace Trio Ruled Out Of India ODIs, Kyle Jamieson has been called up

హామిల్టన్‌: ప్రస్తుతం జరుగుతన్న ఐదు టీ20 సిరీసులో వరుస ఓటములతో సతమవుతున్న న్యూజిలాండ్‌ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన న్యూజిలాండ్‌ సీనియర్ పేస్‌ బౌలింగ్‌ త్రయం​ ట్రెంట్‌ బౌల్ట్‌,లూకీ ఫెర్గ్యూసన్‌, మ్యాట్‌ హెన్రీలు ఇంకా కోలుకోలేదు. దీంతో టీమిండియాతో వచ్చే వారం ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ఈ సీనియర్ పేసర్లకు చోటు దక్కలేదు. గురువారం కివీస్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది.

యువ పేసర్లకు అవకాశం:

యువ పేసర్లకు అవకాశం:

వన్డే సిరీస్‌ నాటికి పేస్ త్రయం తేరుకుంటారని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ తొలుత భావించింది. కాగా, వారు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అనుభవజ్ఞులైన పేసర్లు గాయాల పాలవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీమిండియాతో వన్డే సిరీస్‌కు యువ పేసర్లకు కివీస్ బోర్డు అవకాశం ఇచ్చింది. ముగ్గురి స్థానాల్లో కైల్‌ జేమిసన్‌, స్కాట్‌ కుగ్లీజిన్‌, హమిష్‌ బెన్నెట్‌లకు కివీస్‌ వన్డే జట్టులో చోటు కల్పించారు. జేమిసన్‌ తొలిసారి న్యూజిలాండ్‌ నుంచి పిలుపు అందుకోగా.. కుగ్లీజిన్‌, బెన్నెట్‌లు 2017లో చివరిసారి వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఇక అనుభవం ఉన్న టిమ్‌ సౌథీనే కివీస్ నమ్ముకుంది.

 గ్రాండ్‌ హోమ్‌కు చోటు:

గ్రాండ్‌ హోమ్‌కు చోటు:

చివరి రెండు టీ20ల్లో చోటు దక్కని ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌కు వన్డేల్లో చోటిచ్చారు. జిమ్మీ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌ ఆల్‌రౌండర్‌ సేవలు అందించనున్నారు. నీషమ్‌ జట్టులో ఉండడం కొంత కలిసొచ్చే అంశమే. ఇక స్పిన్నర్‌ ఇష్‌ సోధిని కేవలం ఒక వన్డేకు మాత్రమే ఎంపిక చేశారు. గప్తిల్‌, విలియమ్సన్‌, బ్లండెల్‌, లాథమ్‌, టేలర్‌, నికోల్స్‌ బ్యాటింగ్ భారం మోయనున్నారు. 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఆడుతున్న తొలి వన్డే సిరీస్‌ ఇదే కావడం గమనార్హం.

పరువు నిలుపుకోవాలని కివీస్:

పరువు నిలుపుకోవాలని కివీస్:

భారత్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన కివీస్‌.. ఇప్పుడు మరింత డీలా పడింది. బుధవారం భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ ఓడిపోయింది. దీంతో టీ20 సిరీస్‌ను 3-0తో భారత్‌కు అప్పగించింది. ఇక మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచి కనీసం పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక టీ20 సిరీస్‌ తర్వాత జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావడంపై కివీస్‌ తర్జన భర్జనలు పడుతోంది.

న్యూజిలాండ్‌ వన్డే జట్టు:

న్యూజిలాండ్‌ వన్డే జట్టు:

కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), హమిష్‌ బెన్నెట్‌, టామ్‌ బ్లండెల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మార్టిన్‌ గప్టిల్‌, కైల్‌ జేమిసన్‌, స్కాట్‌ కుగ్లీజిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోలస్‌, మిచెల్‌ సాంట్నార్‌, ఇష్‌ సోథీ, టిమ్‌ సౌతీ, రాస్‌ టేలర్‌.

Story first published: Thursday, January 30, 2020, 14:13 [IST]
Other articles published on Jan 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+