న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ ప్రపంచకప్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన న్యూజిలాండ్‌

ICC Cricket World Cup 2019:New Zealand Has The Worst Power Play Rrecord In World Cup 2019
 New Zealand has the worst power Play record in this World Cup

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలు బుల్లెట్ బంతులేశారు. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 27 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఈ ప్రపంచకప్‌లో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా కివీస్ దాన్ని సవరించి చెత్త గణాంకాలను నమోదు చేసింది. ఇక బంగ్లాపై పాక్ 31 పరుగులు చేసింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగికింది. కేవలం ఒక్క పరుగు స్కోరుకే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు జట్టును ఆదుకున్నారు.

ఈ జోడి అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం జడేజా టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ (28; 51 బంతుల్లో 2×4)ను క్లీన్ బోల్డ్ చేసాడు. ప్రస్తుతం కివీస్ బ్యాట్స్‌మన్‌ స్వేచ్ఛగా పరుగులు తీయలేకపోతున్నారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (44), రాస్ టేలర్ (15)లు ఉన్నారు. 28 ఓవర్లకు న్యూజిలాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.

Story first published: Tuesday, July 9, 2019, 17:22 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X