Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టిస్తారా?: భారత్‌లో వన్డే సిరీస్ గెలవని న్యూజిలాండ్

ధర్మశాల: భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరిస్‌ను గెలవలేదన్న బాధ కివీస్ ఆటగాళ్లను వెంటాడుతూనే ఉంది. అయితే విలియం సన్ నేతృత్వంలోని కివీస్ సేన ఈ చరిత్రను తిరిగరాస్తుందా? అనే విషయం ఆసక్తిగా మారింది. ఇందుకోసం ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న జట్లు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

భారత్‌లో న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ ఆడి శుక్రవారానికి 29 ఏళ్లు పూర్తి అవుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇరు జట్ల మధ్య 21 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో న్యూజిలాండ్ కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అంతేకాదు ఒక్క సిరిస్‌ను కూడా గెలవలేకపోయింది.

ఇటీవల టెస్టు సిరిస్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. టెస్టు సిరిస్ వైఫల్యాన్ని గుర్తుకు రానీయకుండా వన్డే సిరిస్‌ను ప్రారంభించాలని కివీస్ భావిస్తోంది. 16న జరగనున్న ధర్మశాల మ్యాచ్‌లో విలియం సన్ సేన కసరత్తులు చేస్తుండగా, ఈ సిరీస్‌ను కూడా గెలిచి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాలని ధోనిసేన భావిస్తోంది.

New Zealand has never won so far in the one day series in india Against Team India

టెస్టుల్లో విఫలమైన కివీస్ బ్యాట్స్‌మెన్ వన్డేల్లో పుంజుకునే అవకాశం లేకపోలేదు. వన్డేల్లో 237 నాటౌట్, 189 నాటౌట్ లాంటి భారీ స్కోర్లు నమోదు చేసిన గప్టిల్ ఇప్పుడు భారత్‌పై కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌ను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. ఓపెనింగ్‌లో భారీ షాట్లను అలవోకగా కొట్టగలిగే సామర్ధ్యం ఉన్న ఆటగాడు గప్టిల్.

పేస్ బౌలింగ్‌కు ధర్మశాల పిచ్ అనుకూలించే అవకాశం ఉండటంతో క్రీజులో ఒక్కసారి కుదురుకుంటే ఇక అతన్ని ఆపడం ఎవరితరం కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ధర్మశాల పిచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది.

New Zealand has never won so far in the one day series in india Against Team India

అదే ఉత్సాహంతో భారత్‌పై కూడా విజయం సాధించాలని కివీస్ జట్టు ఊవిళ్లూరుతోంది. ఇప్పటివరకు భారత్‌లో న్యూజిలాండ్ ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కూడా గెలవలేదు. గతంలో ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగు వన్డే సిరీస్‌లను (1995, 98, 99, 2010) చెరోసారి (ఆతిథ్య దేశం) గెలిచాయి.

ఇరు జట్ల మధ్య చివరిసారిగా జరిగిన సిరీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌లను క్లీన్‌స్వీప్ చేసింది. కాగా, ఐసీసీ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉంది. ఆటగాళ్ల పరంగా ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలిగే సత్తా ఉన్న వారు ఆ జట్టు సొంతం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+