డబుల్ సెంచరీ హీరో షాకింగ్ డెసిషన్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డ్ గప్టిల్ పేరిటే ఉండటం విశేషం.
న్యూజిలాండ్ దిగ్గజ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కెరీర్లో మద్దతుగా నిలిచిన కివీస్ క్రికెట్ బోర్డు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు గప్టిల్. దాదాపు 14 సంవత్సరాల పాటు జట్టుకు ప్రాతినిథ్యం వహించి కెరీర్ కు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. గప్టిల్ చివరి సారిగా 2022 అక్టోబర్‌లో న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగాడు. మొత్తంగా కెరీర్ లో 367 మ్యాచ్‌ల్లో 13,463 పరుగులు చేశాడు. 23 సెంచరీలు బాదాడు.
న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. 122 మ్యాచుల్లో 3561 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లోనూ 7,346 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ గానూ రికార్డు క్రియేట్ చేశాడు. 2009లో వెస్టిండిస్‌పై జరిగిన మ్యాచ్‌లో సెంచరీని బాదాడు. అలానే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డ్ గప్టిల్ పేరిటే ఉంది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ లో గప్టిల్ వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 237 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అలా వన్డేల్లోనూ డబుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. 24 ఫోర్లు, 11 సిక్సర్లతో వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications