Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామ కేప్టెన్సీ మెరుపులు- టీ20 ప్రపంచకప్ సెమీస్‌ చేరిన తొలి జట్టు..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే విషయంపై ఓ స్పష్టత వస్తుంది.

 కీలక మ్యాచ్‌లల్లో..

కీలక మ్యాచ్‌లల్లో..

సెమీ ఫైనల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో జరిగే మ్యాచ్‌లన్నీ అత్యంత కీలకంగా మారాయి. న్యూజిలాండ్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవ్వాళ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. రేపు ఇంగ్లాండ్.. శ్రీలంకతో తలపడుతుంది. ఆదివారం బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లు ఉన్నాయి. నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్-పాకిస్తాన్, భారత్-జింబాబ్వే ఆడనున్నాయి. ఇవన్నీ ఆయా జట్లను సెమీ ఫైనల్స్‌ ప్రస్థానాన్ని నిర్దేశించేవే.

తొలి జట్టుగా..

తొలి జట్టుగా..

తన ముందు ఉన్న అడ్డంకిని న్యూజిలాండ్ అధిగమించింది. ఎలాంటి ఈక్వేషన్లతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. ఐర్లాండ్‌ను 35 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్ సెమీఫైనల్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.

 185 పరుగుల భారీ టార్గెట్..

185 పరుగుల భారీ టార్గెట్..

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తడబడింది. ఐర్లాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్-37, ఆండీ బల్బిర్నె-30 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 68 పరుగులు జోడించారు.

వరుస వికెట్లు..

వరుస వికెట్లు..

ఆ తరువాత న్యూజిలాండ్ బౌలర్లు విజ‌ృంభించారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. ఎక్కడే గానీ భారీ భాగస్వామ్యం నమోదు కాలేదు. బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఒక్క ట్రెంట్ బౌల్ట్ మినహా మిగిలిన వారందరూ వికెట్లు పడగొట్టారు. లోకీ ఫెర్గూసన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. టిమ్ సౌథీ, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధీ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. భారీ భాగస్వామ్యం నెలకొంటుదనుకున్న ప్రతీసారీ కేన్ విలియమ్సన్ బౌలర్లను మార్చుతూ వచ్చాడు.

న్యూజిలాండ్ భారీ స్కోర్..

న్యూజిలాండ్ భారీ స్కోర్..

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఫిన్ అలెన్- 32, డెవాన్ కాన్వే- 28 పరుగులు చేశారు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తరువాత టచ్‌లోకి వచ్చాడు. సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసే ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లోనే మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్-17 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నాడు. డారిల్ మిఛెల్ 21 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జేమ్స్ నీషమ్, మిఛెల్ శాంట్నర్ డకౌట్ అయ్యారు.

Story first published: Friday, November 4, 2022, 13:37 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+