న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

68 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ క్రికెటర్

New Zealand Cricketer Ewen Chatfield Retires At 68

హైదరాబాద్: న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ ఈవెన్‌ ఛాట్‌ఫీల్డ్‌ 68 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 'ది నానే ఎక్స్‌ప్రెస్‌'గా గుర్తింపు పొందిన ఛాట్‌ఫీల్డ్‌ వెల్లింగ్టన్‌లో శనివారం నానే ఓల్డ్‌ బాయ్స్‌ జట్టుకు ఆడిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపాడు.

3rd ODI: గాల్లోకి లేచి మరీ హార్ధిక్ పాండ్యా సూపర్ క్యాచ్ (వీడియో)3rd ODI: గాల్లోకి లేచి మరీ హార్ధిక్ పాండ్యా సూపర్ క్యాచ్ (వీడియో)

"ఇది నవ్వు తెప్పించొచ్చు. 68 ఏళ్ల వయసులోనూ నాకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. నేనా ప్రమాణాల ప్రకారం ఆడకపోతే వీడ్కోలు పలకాలని భావించా" అని ఛాట్‌ఫీల్డ్‌ అన్నారు. 1975లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్‌లో జెఫ్‌ హోవర్త్‌తో చివరి వికెట్‌ 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే మ్యాచ్‌లో ఛాట్‌ఫీల్డ్‌ వేసిన బౌన్సర్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ పీటర్ లీవర్‌ తల పగిలి పోయింది. దీంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఇంగ్లాండ్‌ ఫిజియో థెరపిస్టు బెర్నార్డ్‌ థామస్‌ సమయస్ఫూర్తితో వెంటనే సీపీఆర్‌ ప్రక్రియ ద్వారా లీవర్‌ ప్రాణాలు కాపాడారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ముందు ఛాట్‌ఫీల్డ్‌ సెంచరీ సాధించాలని ఆశించాడు. అయితే, ఆడిన తొలి బంతికే ఔటై గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తన వీడ్కోలు వార్తకు ఎలాంటి హెడ్డింగ్ పెట్టాలో ఆయనే చెప్పారు. ఇంతకీ ఆ హెడ్డింగ్ ఏంటంటే 'నానే ఎక్స్‌ప్రెస్‌లో ఇంధనం అయిపోయింది' అని.

Story first published: Monday, January 28, 2019, 11:15 [IST]
Other articles published on Jan 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X