For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కివీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే మాకేం అభ్యతరం లేదు'

New Zealand Cricket Clears The Air On Players Participation In IPL 2020


ఆక్లాండ్‌:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు క్రీడా టోర్నీలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ సిరీస్, ఇంగ్లండ్-శ్రీలంక టెస్టు సిరీస్‌, దక్షిణాఫ్రికా-భారత్ వన్డే సిరీస్‌లు అర్థంతరంగా రద్దు అయ్యాయి. అయితే ఐపీఎల్ 2020ని ఏప్రిల్ 15న ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే అది వాళ్ల ఇష్టమని కివీస్‌ బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు కివీస్ ఆటగాళ్లకు సమాచారం అందిస్తున్నామని, తగిన జాగ్రత్తలు సూచిస్తున్నామని కివీస్‌ బోర్డు తెలిపింది. అలాగే ప్రపంచ వైద్యారోగ్య అధికారులు చెప్పిన విషయాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని కూడా పేర్కొంది. ఐపీఎల్ మొదలయితే టోర్నీలో ఆడడం కివీస్ ఆటగాళ్ల యిష్టం అని పేర్కొంది. ఐపీఎల్ టోర్నీ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చేనెల 15కు వాయిదా వేసింది.

స్టార్ పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌కు కరోనా వైరస్‌ (కొవిడ్-19) వైరస్‌ లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ఈ రోజు వచ్చిన రిపోర్టులో ఫెర్గూసన్‌కు కరోనా వైరస్‌ నెగిటివ్‌ అని తేలింది. దీంతో ఫెర్గూసన్‌తో పాటు కివీస్‌ జట్టుకు భారీ ఉపశమనం లభించింది. గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో ఫెర్గూసన్‌కు కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ రద్దయింది. ఇప్పటికే శుక్రవారం తొలి వన్డే ఆడిన ఇరు జట్లు మిగతా రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టే వారిని కచ్చితంగా 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆ దేశం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంక్షలు అమలయ్యే ముందే స్వదేశానికి తరలిపోవాలని కివీస్‌ క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వన్డే సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌లో ఆడాల్సిన టీ20 సిరీస్‌ కూడా రద్దైనట్లే.

ఐపీఎల్‌లో ఆడుతున్న ఆరుగురు కివీస్‌ ఆటగాళ్లు వీరే:

1. లాకీ ఫెర్గూసన్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌)
2. మిచెల్‌ మెక్‌క్లెనాఘన్‌ (ముంబై ఇండియన్స్‌)
3. ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై ఇండియన్స్‌)
4. కేన్‌ విలియమ్సన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
5. మిచెల్‌ శాంట్నర్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)
6. జిమ్మీ నీషమ్‌ (కింగ్స్‌ XI పంజాబ్‌)

Story first published: Saturday, March 14, 2020, 19:30 [IST]
Other articles published on Mar 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+