
కేప్‌టౌన్: న్యూజిలాండ్ క్రికెటర్లకి 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని శుక్రవారం కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్ సిరీస్‌లు అన్నీ రద్దవడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ 20 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటిచ్చింది. అయితే స్టార్ ఓపెనర్ కొలిన్ మున్రోకి మాత్రం కివీస్ బోర్డు షాక్ ఇచ్చింది. గతేడాది ప్రదర్శన ఆధారంగా వార్షిక కాంట్రాక్ట్‌లను బోర్డు విడుదల చేసింది.
భారత్‌తో గత ఫిబ్రవరి నెలలో జరిగిన సుదీర్ఘ సిరీస్‌లో నిలకడగా రాణించిన 6.6 అడుగుల పేస్ బౌలర్ కైల్ జెమీషన్‌కి తొలిసారి కాంట్రాక్ట్‌లో ఛాన్స్ లభించింది. మొత్తంగా కివీస్ బోర్డు ఈసారి ముగ్గురు యువ క్రికెటర్లకి చోటు కల్పించింది. జెమీషన్‌తో పాటు ఇటీవల కాలంలో టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన అజాజ్ పాటిల్, 2017లో దక్షిణాఫ్రికా నుంచి న్యూజిలాండ్‌కి వలస వచ్చిన దేవన్ కాన్వేకు కొత్తగా కాంట్రాక్ట్‌లో న్యూజిలాండ్ బోర్డు చోటిచ్చింది. కొలిన్ మున్రో, జీత్ రావల్‌కి మాత్రం చోటు దక్కలేదు.
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు వీరే:
కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, లూకీ ఫర్గూసన్, మార్టిన్ గప్తిల్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, అజాజ్ పాటిల్, నీల్ వాంగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్, దేవన్ కాన్వే.
ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్లకి 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. సీఏ కూడా 20 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటిచ్చింది. గతేడాది యాషెస్ సిరీస్ మూడో టెస్టు నుంచి ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన ఉస్మాన్ ఖవాజాకు వార్షిక కాంట్రక్ట్‌లో చోటు దక్కలేదు. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ హరీస్, షాన్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, నాథన్ కౌల్టర్ నైల్ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. వీరి స్థానాల్లో కొత్తగా మార్నస్ లబుషేన్, ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, మిషెల్ మార్ష్, మాథ్యూ వెడ్, కేన్ రిచర్డ్‌సన్ కాంట్రక్ట్ పొందారు.