ఐపీఎల్ ఫైనల్ వరకు అందుబాటులో: కివీస్ ఆటగాళ్లకు బోర్డు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 పూర్తి సీజన్‌కు కివీస్ క్రికెటర్లు అందుబాటులో ఉంటారని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు మే 1 వరకూ మాత్రమే ఐపీఎల్ 2019 సీజన్‌లో అందుబాటులో ఉంటారని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేశాయి. అయితే, న్యూజిలాండ్ బోర్డు మాత్రం తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు అందుబాటులో ఉంటారని ప్రకటించింది.

న్యూజిలాండ్ క్రికెటర్లపై నిర్ణయం తీసుకున్న బోర్డు
న్యూజిలాండ్ క్రికెట్‌కు చెందిన జేమ్స్ వేర్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ "ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ వరకు న్యూజిలాండ్ క్రికెటర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది" అని తెలిపారు.

న్యూజిలాండ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు
"ఐపీఎల్‌లో న్యూజిలాండ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరంతా కూడా ఐపీఎల్ ఫైనల్ వరకు ఆయా ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు" అని అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది. ఐపీఎల్‌లో పాకిస్థాన్ మినహా అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే.

పలు ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం
ఐపీఎల్ 2018 సీజన్‌లో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, కొలిన్ మున్రో, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, మిచెల్ మెక్లనగాన్ లాంటి ఆటగాళ్లు పలు ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలు తమ ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ సీజన్ మధ్యలో వెనక్కి పిలిపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్ల లభ్యతపై
దీంతో వచ్చే సీజన్‌లో బీసీసీఐ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకి ఐపీఎల్‌లో ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్ల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని కోరింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పైరీతిలో స్పందించింది. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications