For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతుల పరంగా వన్డే చరిత్రలోనే టీమిండియాకు అతిపెద్ద ఓటమి

India Vs New Zealand : New Zealand Consign India To Biggest ODI Loss In Terms Of Balls Remaining
New Zealand consign India to biggest ODI loss in terms of balls remaining

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడి.... దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతిపెద్ద ఓటమిని రుచి చూసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కివీస్ బౌలర్ల దెబ్బకు 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది.

93 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి

అనంతరం భారత్ నిర్దేశించిన 93 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ కేవ‌లం 14.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో 212 బంతులు మిగిలి ఉండగానే ఓటమిపాలైన టీమిండియా బంతుల పరంగా 2010‌లో నమోదైన ఓటమి రికార్డుని సవరించింది.

209 బంతులు మిగిలి ఉండగానే

209 బంతులు మిగిలి ఉండగానే

శ్రీలంకతో దంబుల్లా వేదికగా 2010లో జరిగిన వన్డేలో 209 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత మళ్లీ తొమ్మిదేళ్లకు 212 బంతుల తేడాతో గురువారం హామిల్డన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఎక్కువ బంతుల పరంగా భారత్ ఓడిపోయిన టాప్-5 వన్డే మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే..

Margin Balls left Toss Opponents Venue Year
8 wickets 212 Lost New Zealand Hamilton 2019
8 wickets 209 Won Sri Lanka Dambulla 2010
9 wickets 181 Won Sri Lanka Hambantota 2012
7 wickets 176 Lost Sri Lanka Dharamsala 2017
9 wickets 175 Lost Australia Sydney 1981
212 బంతులతో జాబితాలో అగ్రస్థానంలో

212 బంతులతో జాబితాలో అగ్రస్థానంలో

హామిల్టన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌ 212 బంతులతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత దంబుల్లా వన్డే 209 బంతులతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో 181 బంతుల తేడాతో 2012లో శ్రీలంకతో హంబన్‌తోటలో జరిగిన వన్డే మ్యాచ్ నిలిచింది. నాలుగో స్థానంలో మళ్లీ శ్రీలంకతో 2017లో ధర్మశాల వేదికగా జరిగిన వన్డే 176 బంతులతో.. ఇక ఐదో స్థానంలో 1981లో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ 175 బంతులతో ఉంది.

1
44083
Story first published: Thursday, January 31, 2019, 13:29 [IST]
Other articles published on Jan 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+