న్యూజిలాండ్ బ్యాటర్ చాద్ బౌస్ లిస్ట్-ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 103 బంతుల్లో ద్విశతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో భారత ఆటగాడు నారాయణ్ జగదీషన్ , ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత వరల్డ్ రికార్డులను బ్రేక్ చేశాడు.
ఫోర్డ్ ట్రోఫీలో కాంటర్బరీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న చాద్ బౌస్ ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 110 బంతుల్లో 205 పరుగులు చేశాడు. 27 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. చాద్ ద్విశతకంతో సత్తాచాటడంతో కాంటర్బరీ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 343 పరుగులు చేసింది. బేకన్ అయిదు వికెట్లు తీశాడు. కాంటర్బరీ జట్టులో చాద్ తర్వాత అత్యధిక స్కోరు జకరీ ఫోక్స్ చేసిన 49 పరుగులే.

అనంతరం ఛేదనలో ఒటాగో 24.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సీన్ డేవీ, మైకేల్ రిప్పన్ చెరో మూడు వికెట్లు తీశారు. చాద్ బౌస్ కంటే ముందు ఫాస్టెస్ డబుల్ సెంచరీ రికార్డు హెడ్, జగదీషన్ పేరిట ఉండేది. వీరిద్దరు 114 బంతుల్లో ద్విశతకం బాదారు. కాగా, ఫోర్డ్ ట్రోఫీలో పుష్కరకాలం తర్వాత నమోదైన తొలి ద్విశతకం ఇదే. 2012/13 సీజన్‌లో జేమీ సెంట్రల్ స్టాగ్స్ తరఫున 222 పరుగులు చేశాడు.
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించిన కొన్ని గంటలకే చాద్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. నవంబర్ 9 నుంచి శ్రీలంకతో కివీస్ రెండు టీ20లు, మూడు టీ20 ఆడనుంది. మిచెల్ శాంట్నర్ జట్టును నడిపించనున్నాడు. కాగా, న్యూజిలాండ్ తరఫున 32 ఏళ్ల చాద్ బౌస్ ఆరు వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వన్డేల్లో 99, టీ20ల్లో 187 పరుగులు చేశాడు.
A world record for Chad Bowes! Brings up his double century from just 103 balls for Canterbury! Travis Head and Narayan Jagadeesan with the previous List A record of 114 balls. LIVE stream + HIGHLIGHTS | https://t.co/XdSuQE7ceZ #FordTrophy pic.twitter.com/mNZe65UEtE
— BLACKCAPS (@BLACKCAPS) October 23, 2024