ఉమెన్ vs ఉమెన్: తన భార్య గర్భం ధరించిందన్న కివీస్ మహిళా జట్టు కెప్టెన్

హైదరాబాద్: కివీస్ క్రికెట్ బోర్డు కొత్త నిబంధనల ప్రకారం వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవుని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమీ శాటర్త్‌వైట్ అరుదైన ఘనత సాధించింది. 32 ఏళ్ల అమీ శాటర్త్‌వైట్... అదే జట్టులోని సీనియర్ బౌలర్ లీ తహూహూను వివాహమాడింది.
దీంతో ప్రపంచంలో పెళ్లి చేసుకున్న తొలి మహిళల క్రికెట్ జోడీగా చరిత్ర సృష్టించారు. లీ తహూహూ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనున్న మహిళల వరల్డ్ టీ20 టోర్నీకి సైతం అమీ శాటర్త్‌వైట్ కానుంది.

వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవుని
అమీ శాటర్త్‌వైట్ 2019-20 కాలానికి గాను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్టులో కొనసాగుతున్నారు. దీంతో వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవును మంజూరు చేసింది. బోర్డు కొత్త కొత్త నిబంధనల ప్రకారం ఆమెకు బోర్డు పూర్తిస్థాయి వేతనాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చెల్లించనుంది.

ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ మాట్లాడుతూ
ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ మాట్లాడుతూ "కొత్త అగ్రిమెంట్ ప్రకారం ప్రెగ్నెన్సీ సెలవు నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవుని పొందిన తొలి మహిళా క్రికెటర్. దీని అర్థం ఆమెకు మెటిర్నిటీ సెలవు రోజుల్లో మొత్తం వేతనం చెల్లించబడుతుంది. కొన్ని ఆఫ్-ఫీల్డ్ కాంట్రాక్టు బాధ్యతలను నెరవేర్చినప్పటికీ, శిక్షణ లేదా ఆడాల్సిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చారు.
'డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఆర్చర్ బౌలింగ్ చూడటం చాలా భయంగా ఉంటుంది'

2021 వరల్డ్‌కప్ నాటికి తిరిగి జట్టులో చేరుతానని
మరోవైపు తాను మెటర్నిటీ సెలవు తీసుకున్నప్పటికీ జట్టుకు తన సలహాలు ఉంటాయని అమీ వెల్లడించింది. 2021 వరల్డ్‌కప్ నాటికి తిరిగి జట్టులో చేరుతానని తెలిపింది. ఈ సందర్భంగా అమీ మాట్లాడుతూ "ఒక కుటుంబంగా మారే క్రమంలో ఆట నుంచి విరామం తీసుకోవాడానికి బోర్డు ఎంతో మద్దతు ఇస్తున్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని" అని అమీ తెలిపింది.

ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం
"లీ, నేను ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది. మా జీవితాల్లో ఇదొక ప్రత్యేక సమయం. ఈ కొత్త అధ్యాయం కోసం మేం ఎదురు చూడలేకపోతున్నాం" అని అమీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అయితే ఏ పద్ధతుల ద్వారా వీరు బిడ్డకు జన్మనిస్తున్నారో మాత్రం వెల్లడించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications