Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Trent Boult: 300 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన స్టార్ బౌల‌ర్

New Zealand bowler Trent Boult joins the 300 wickets club

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మెహాది హాసన్‌ వికెట్‌ పడగొట్టి టెస్టుల్లో ఈ రికార్డు చేరుకున్నాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన మూడో న్యూజిలాండ్ బౌల‌ర్‌గా బౌల్ట్ నిలిచాడు. వేగంగా 300 వికెట్లు ప‌డ‌గొట్టిన న్యూజిలాండ్ బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బోల్ట్‌ కంటే ముందు ఆర్జే హాడ్లీ (431), డానియల్‌ వెటోరీ (361), టీమ్‌ సౌథీ (328) న్యూజిలాండ్ త‌ర‌ఫున‌ ఈ జాబితాలో ముందున్నారు.

కివీస్ దిగ్గ‌జం ఆర్జే హాడ్లీ 61 మ్యాచ్‌ల్లోనే 300 వికెట్లు తీశాడు. ఇక బోల్ట్ 75 మ్యాచ్‌ల్లో ఈ ఘ‌న‌తను అందుకున్నాడు. సౌథీ 76 మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త‌ను అందుకుని మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఉన్న డానియ‌ల్ వెటోరీ 94 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు క్ల‌బ్‌లో చేరాడు.

ఇక టెస్టు మ్యాచ్ విష‌యానికొస్తే ఈ మ్యాచ్‌లో స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ చెల‌రేగాడు. 5 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. అత‌నికి సౌథీ, జేమిన్స‌న్ కూడా స‌హ‌క‌రించ‌డంతో బంగ్లాదేశ్ విల‌విలలాడింది. చివ‌ర‌కు 126 ప‌రుగులకే కుప్ప‌కూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 395 ప‌రుగుల భారీ అధిక్య‌త‌ను సాధించింది. అంత‌కు ముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టామ్ లాథ‌మ్ డ‌బుల్ సెంచ‌రీకి తోడు, డేవాన్ కాన్వే సెంచ‌రీతో రాణించ‌డంతో 6 వికెట్ల న‌ష్టానికి 521 ప‌రుగుల వ‌ద్ద కివీస్ త‌మ స్కోర్‌ను డిక్లేర్ చేసింది. లాథ‌మ్ 252, కాన్వే 109 ప‌రుగుల‌తో చెల‌రేగారు.

IPL పుణ్యమాని భారత్ పిచ్ లపై క్లారిటీ వచ్చేసింది - Trent Boult | Ind Vs Nz || Oneindia Telugu

ఇక కెరీర్‌లో చివ‌రి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు రాస్ టేల‌ర్ తొలి ఇన్నింగ్స్‌లో 28 ప‌రుగులు సాధించాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న టేల‌ర్ 5 ఫోర్ల సాయంతో ఈ స్కోర్ చేశాడు. ఈ క్ర‌మంలో హుస్సేన్ బౌలింగ్‌లో ఇస్లాంకు క్యాచ్ ఇచ్చి టేల‌ర్ ఔట్ అయ్యాడు. అంత‌కు ముందు కెరీర్‌లో చివ‌రి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వ‌స్తున్న టేల‌ర్‌కు బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు. న్యూజిలాండ్ ఆట‌గాళ్ల‌తోపాటు అభిమానులు కూడా ఈ సంద‌ర్భంగా టేల‌ర్‌ను అభినందించారు.

Story first published: Monday, January 10, 2022, 12:55 [IST]
Other articles published on Jan 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+