T20 World Cup 2022: అరుదైన ఘనత సాధించిన టిమ్ సౌథీ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‍గా రికార్డు

టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్-12 సమరం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన సౌథీ ఈ ఘనత సాధించాడు. సౌథీ ఇప్పటి వరకు 101 మ్యాచ్‌లు ఆడి..123 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టీ20ల్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ పేరిట ఉంది. షకీబ్ ఇప్పటి వరకు 104 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు పడగొట్టాడు.

హజెల్ వుడ్
కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 201 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సాధించగా.. ఫిన్ అలెన్(16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో) దుమ్మురేపాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్(13 బంతుల్లో 2 సిక్స్‌లతో 26 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. జంపా ఓ వికెట్ పడగొట్టాడు.

విరుచుకుపడ్డ కివీస్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లనో అతను రెండు బౌండరీలు సిక్స్ బాదగా.. రెండో ఓవర్‌లో డేవాన్ కాన్వే సైతం రెండు ఫోర్లు కొట్టడంతో కివీస్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఫించ్ బౌలర్లను మార్చినా.. ఫిన్ అలెన్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. దాంతో కివీస్ 3.5 ఓవర్లలో 50 పరుగులను పూర్తి చేసుకుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన ఫిన్ అలెన్‌ను హజెల్ వుడ్ సూపర్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఓటమి వైపు
లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. క్రమంగా వికెట్లు కోల్పోతూ ఓటిమి దగ్గరయ్యింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగు చేశాడు. మిగతా వారు తక్కువ పరుగులకే ఔటయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications