ముగిసిన టేలర్ కెరీర్
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ముగియండతో దిగ్గజ బ్యాటర్ రాస్ టేల కెరీర్ కూడా ముగిసింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ల అనంతరం తాను రిటైర్ అవుతున్నట్లు 37 ఏళ్ల రాస్ టేలర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి టెస్టులో టేలర్ 28 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్‌లో మొత్తం 112 టెస్టు మ్యాచ్‌లాడిన టేలర్ 44 సగటుతో 7684 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 290 పరుగులు. మూడు వికెట్లు కూడా తీశాడు. అలాగే 233 వన్డేల్లో 48 సగటుతో 8576 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 181 పరుగులు. ఇక 102 టీ20ల్లో 25 సగటుతో 1909 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 63 పరుగులు.
న్యూజిలాండ్ ఘన విజయం
ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ డబుల్ సెంచరీ(252), కాన్వే(109) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 521 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అయితే కివీస్ బౌలర్ల ధాటికి విలవిలాడిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 278 పరుగులు సాధించినప్పటికీ ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు.
లిటన్ దాస్ సెంచరీ
395 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేలా కనిపించలేదు. ఆ జట్టు బ్యాటర్ లిటన్ దాస్(102) సెంచరీతో పోరాడిన ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు ఎవరూ సహకరించకపోవడంతో ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 4, వాగ్నర్ 3, టేలర్, మిచెల్, సౌథీ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోర్లు
న్యూజిలాండ్: 521-6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్: 126, 278


Click it and Unblock the Notifications












