టీమిండియాపై విజయం: ఐదో జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

హైదరాబాద్: బుధవారం ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి సెమీపైనల్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో న్యూజిలాండ్ పైనల్‌కు చేరగా... టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో రిజర్వ్ డే అయిన బుధవారం ఆటను కొనసాగించగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చివరివరకు పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు.
దీంతో టీమిండియా వరుసగా రెండోసారి సెమీస్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించగా... న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 2015లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా న్యూజిలాండ్ పైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

రెండోసారి ఫైనల్‌కు చేరిన జట్టుగా
ఆస్ట్రేలియా, వెస్టిండిస్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల తర్వాత వరుసగా రెండోసారి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టుగా న్యూజిలాండ్ అరుదైన ఘనత సాధించింది. 1975లో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభమైన తర్వాత ఇలా రెండోసారి ఫైనల్‌కు చేరిన ఐదో జట్టు న్యూజిలాండ్. 1996 నుంచి 2007 మధ్య కాలంలో ఆస్ట్రేలియా నాలుగు సార్లు ఫైనల్‌కు చేరింది.

ఆస్ట్రేలియా మూడు సార్లు విశ్వవిజేతగా
ఇందులో మూడు సార్లు(1999, 2003, 2007)లలో ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలిచింది. అయితే, 1996లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మాత్రం ఓడిపోయింది. ఇక, వెస్టిండిస్ విషయానికి వస్తే 1975 నుంచి 1983 మధ్య కాలంలో మూడు సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1975, 1979లలో విశ్వ విజేతగా నిలిచింది.

హ్యాట్రిక్ సాధించడంలో వెస్టిండిస్ విఫలం
1983లో హ్యాట్రిక్ సాధించడంలో విఫలమైంది. 1983 ప్రపంచకప్ పైనల్లో వెస్టిండిస్ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ మూడు వరల్డ్‌కప్ పైనల్స్‌కు క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఇక, ఇంగ్లాండ్ విషయానికి వస్తే 1987, 1992లో వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది.

ధోని సేన చేతిలో ఓడిన శ్రీలంక
అయితే, 1987లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగా... 1992లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. కరేబియన్ దీవులు ఆతిథ్యమిచ్చిన 2007 ప్రపంచకప్ పైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన శ్రీలంక... ఆ తర్వాత 2011లో ధోని సేన చేతిలో ఓడింది.

కెప్టెన్ల పరంగా చూస్తే
ఇక, కెప్టెన్ల పరంగా చూస్తే క్లైవ్ లాయిడ్ సారథ్యంలో మూడు సార్లు వెస్టిండిస్ జట్టు ఫైనల్‌కు చేరగా... ఆస్ట్రేలియాకు మాత్రం 1996 నుంచి 2007 వరకు మార్క్ టేలర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్(రెండు సార్లు) కెప్టెన్లుగా సారథ్యం వహించారు. ఇంగ్లాండ్ 1987లో మైక్ గాటింగ్ సారథ్యం వహించగా... 1992లో గ్రాహం గూచ్ కెప్టెన్‌గా ఉన్నారు.

2011లో కుమార సంగక్కర సారథ్యంలో
శ్రీలంక జట్టుకు 2007లో మహిళా జయవర్దనే సారథ్యం వహించగా... 2011లో కుమార సంగక్కర కెప్టెన్‌గా ఉన్నారు. 2015లో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ సారథ్యం వహించగా... 2019లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలో న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవని కివీస్ ఈసారి కప్ గెలవాలని ఊవిళ్లూరుతోంది.
{headtohead_cricket_3_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications