Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్ మాయ, హెల్మెట్టే వికెట్ పడేలా చేసింది

New Zealand batsman Mark Chapman gets dismissed in bizarre fashion

హైదరాబాద్: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. అనేక రికార్డులు బద్దలు కావడంతోపాటు ఫన్నీ సంఘటనలకు కూడా ఈ మ్యాచ్ వేదికైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైసిరీస్‌లో భాగంగా ఆసీసీ, కివీస్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ కివీస్ ఆటగాడు వెరైటీగా ఔటయ్యాడు.

ఇటీవలి కాలంలో టీ20 మ్యాచ్‌లో ఇలా ఔట్‌కావడం తొలిసారేనని విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ బిల్లీ స్టాన్‌లేక్‌ 18వ ఓవర్ వేస్తున్నాడు. ఓవర్ ఆఖరి బంతిని మార్క్ చాప్‌మాన్ ఎదుర్కొంటున్నాడు.

పుల్ షాట్ ఆడే క్రమంలో వేసిన బంతికి మార్క్ ఎవరూ ఊహించని విధంగా ఔట్ అయ్యాడు. దీంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అసలేం జరిగిందంటే, స్టాన్‌లేక్‌ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి నేరుగా వెళ్లి బ్యాట్స్‌మన్ దవడకు తాకింది. ఆ బంతి ధాటికి హెల్మెట్ ఊడిపడి క్రీజులో పడింది. అది కాస్త దొర్లుకుంటూ వెళ్లి స్టంప్స్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో చాప్‌మాన్ హిట్‌వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.

ఇలా గతంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఔటయ్యారు. బ్రెట్లీ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అడమ్ పారోరే, డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో కెవిన్ పీటర్సన్ ఇదే విధంగా వెనుదిరిగిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Story first published: Saturday, February 17, 2018, 14:10 [IST]
Other articles published on Feb 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+