T20 World Cup 2021 ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! చిన్న తప్పిదం శాపంగా మారే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలనుకుంటున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే.. ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 నుంచి ఔట్ అయ్యాడు. గాయం కారణంగా అతడు మెగా టోర్నీ ఫైనల్‌కు దూరమయ్యాడు. దాంతో ఆస్ట్రేలియాతో ఆదివారం (నవంబర్ 14) జరగనున్న ఫైనల్ మ్యాచుకు ముందు కివీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాగే నవంబర్ 17 నుంచి టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కూ డెవాన్ కాన్వే అందుబాటులో ఉండట్లేదు.
ఔటైన నిరాశలో:
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో డెవాన్ కాన్వే అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 38 బంతుల్లో 46 పరుగులు చేసి కివీస్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్‌లో 14 ఓవర్ నాలుగో బంతికి అతడు ఔట్ అయ్యాడు. లియామ్ లివింగ్‌స్టోన్ ఊరించే బంతికి కాన్వె స్టంప్ ఔట్ అయ్యాడు. కీలక సమయంలో ఔటైన నిరాశలో పిడికిలితో తన బ్యాట్‌ను బలంగా బాదాడు. ఈ సమయంలోనే ఇతడి చేతి వేలుకు గాయమైంది. మ్యాచ్ అనంతరం స్కానింగ్ చేయగా.. కాన్వె చిటికిన వేలు విరిగినట్లు నిర్ధరణ అయింది. దీంతో కొంతకాలం పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
చిన్న తప్పిదం పెద్ద శాపంగా మారింది:
వైద్యుల సూచన మేరకు ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్ మ్యాచుకు డెవాన్ కాన్వే అందుబాటులో ఉండడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాన్వే గాయంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ.. ఈ సమయంలో కాన్వే జట్టుకు దూరమవడం బాధగా ఉందన్నాడు. బ్లాక్ క్యాప్స్ కోసం ఆడటం కోసం కాన్వే ఎంతో నిబద్దతగా ఉంటాడని, ఫైనల్ మ్యాచుకు దూరమవడంతో అతడు చాలా నిరాశచెండాడు అని స్టెడ్ చెప్పాడు. ఔటయ్యాననే చిన్న అసంతృప్తితో చేసిన తప్పిదం ఇప్పుడు కీలక ఫైనల్ పోరుతో పాటు టీమిండియాతో టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో లేకుండా చేసింది. చిన్న తప్పిదం కాన్వే పాలిట పెద్ద శాపంగా మారింది.
కివీస్ జట్టులో ఆందోళన:
టీ20 ప్రపంచకప్ 2021లో గాయపడిన రెండో న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే. ఇంతకుముందు కివీస్ స్టార్ పేసర్ లూకీ పెర్గుసన్ కూడా గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. లీగ్ ఆరంభంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో గాయపడటం వల్ల టోర్నీకి దూరమయ్యాడు. ఇలా ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరమవడం కివీస్ జట్టుకు పెద్ద లోటే. పెర్గుసన్ దూరమయినా ఆడమ్ మిల్నే రూపంలో సరైన పేసర్ ఉండడంతో.. ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీలకు అతడు సహరించాడు. అయితే కాన్వే స్థానంలో సరైన బ్యాటర్ లేకపోవడం కివీస్ జట్టులో ఆందోళన నెలకొంది.

ఇక కొత్త చాంపియన్:
బుధవారం అబుదాబిలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కివీస్ అద్భుత విజయం సాధించగా.. గురువారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇక ఆదివారం (నవంబర్ 14) జరుగనున్న మెగా ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలువకపోవడంతో.. క్రికెట్ ప్రేమికులు కొత్త చాంపియన్‌ను చూడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications